2024 Lexus LC 500h | ప్రముఖ కార్ల తయారీ సంస్థ లెక్సాస్ ఇండియా (Lexus India) దేశీయ మార్కెట్లోకి న్యూ2024 ఎడిషన్ స్పోర్ట్స్ కూపె ఎల్సీ 500హెచ్ ఆవిష్కరించింది. ఈ కారు ధర రూ.2.5 కోట్లు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. 3.5 లీటర్ల నాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్, సెల్ఫ్ చార్జింగ్ లిథియం అయాన్ బ్యాటరీతో కూడిన ఎలక్ట్రిక్ మోటార్‌తో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 177 బీహెచ్పీ విద్యుత్, 330 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఎల్సీ 500 హెచ్ 10-రేషియో ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ Add Newవిత్ హైబ్రీడ్ సిస్టమ్ యూజింగ్ 4-స్పీడ్ ఆటోమేటిక్ విత్ సీవీటీ యూనిట్ కలిగి ఉంటుంది.
2024 ఎల్సీ 500హెచ్ లిమిలెడ్ ఎడిషన్ ఇంజిన్ ఎరో డైనమిక్స్, కర్టెసీ ఆఫ్ ది ఫ్రంట్ బంపర్ కనార్డ్, రేర్ ఫిక్స్డ్ కార్బన్ ఎయిరో ఇన్స్పైర్డ్ వింగ్, టూ డోర్స్ కూపే హాకుగిన్ ఎక్స్టీరియర్ కలర్, గ్రిల్లెపై జెట్ బ్లాక్ హైలైట్స్, స్పోర్టింగ్ ప్రొవెస్, 21-అంగుళాల మ్యాట్టె అల్యూమినియం వీల్స్, లిమిటెడ్ ఎడిషన్ స్కఫ్ ప్లేట్ తదితర ఫీచర్లు ఉన్నాయి.