పుణె, జనవరి 4: ప్రముఖ వాహన సంస్థ బజాజ్ ఆటో..దేశీయ మార్కెట్‌కు నయా ఈ-స్కూటర్‌ను పరిచయం చేసింది. మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన చేతక్‌ను అప్‌గ్రేడ్ చేసి మళ్లీ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా ఈవీలకు పెరుగుతున్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ నయా స్కూటర్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. గతంలో విడుదల చేసిన స్కూటర్‌కు కొనుగోలుదారుల నుంచి విశేష స్పందన లభించిందని, ఇప్పటి వరకు లక్షకు పైగా యూనిట్లు అమ్ముడయ్యాయని పేర్కొంది. చేతక్ ప్రీమియం 2024, చేతక్ అర్బన్ 2024 పేర్లతో విడుదల చేసిన ఈ స్కూటర్ల ప్రారంభ ధర రూ.1,15,001గా నిర్ణయించింది.