2023 Komaki SE | మార్కెట్లోకి కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ స్కూటర్.. ధరెంతంటే..?!
2023 Komaki SE |ప్రముఖ ఈవీ స్టార్టప్ కొమకి ఎస్ఈ అప్ గ్రేడెడ్ ఈవీ స్కూటర్ మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీని ధర రూ.96,968 (ఎక్స్ షోరూమ్) నుంచి మొదలవుతుంది.
2023 Komaki SE | ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) స్టార్టప్ కొమకి (Komaki) దేశీయ మార్కెట్లోకి 2023 కొమకి ఎస్ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ తీసుకొచ్చింది. దీని ధర రూ.96,968 (ఎక్స్ షోరూమ్)గా నిర్ణయించారు. 2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్ అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని ఫీచర్లు జత చేశారు. ఎల్ఐఎఫ్ఈపీఓ (లిథియం ఐరన్ ఫాస్పేట్ -LiFePO4 (lithium iron phosphate) బ్యాటరీతో ఈ స్కూటర్ నడుస్తుంది.
2023 కొమకి ఎస్ఈ స్కూటర్ మూడు వేరియంట్లు – ఎకో, స్పోర్ట్, స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ తో వస్తున్నది. కొమకి ఎస్ఈ ఎకో మోడ్ లో 75-90 కి.మీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్ 110-140 కి.మీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ 150-180 కి.మీ దూరం ప్రయాణిస్తుంది.
2023 కొమకి ఎస్ఈ ధరలు (ఎక్స్ షోరూమ్)
కొమకి ఎస్ఈ ఎకో – రూ.96,968
కొమకి ఎస్ఈ స్పోర్ట్ – రూ.1,29,938
కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్‌గ్రేడ్ – రూ.1,38,427
కొమకి ఎస్ఈ ఎకో స్పీడ్ లిమిట్ 55-60 కిమీ, కొమకి ఎస్ఈ స్పోర్ట్, కొమకి ఎస్ఈ స్పోర్ట్ పెర్ఫార్మెన్స్ అప్ గ్రేడ్ స్పీడ్ లిమిట్ 75-80 కి.మీ గా నిర్ణయించారు. ఎల్ఐఎఫ్ఈపీఓ4 బ్యాటరీతో మూడు కిలోవాట్ల హబ్ మోటార్‌తో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నడుస్తుంది. ఈ స్కూటర్ పూర్తిగా చార్జింగ్ కావడానికి 4-5 గంటల టైం పడుతుంది.
2023 కొమకి ఎస్ఈ ఈవీ స్కూటర్లో పార్కింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్, రివర్స్ అసిస్ట్, ఎల్ఈడీ ఫ్రంట్ వింకర్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, డ్యుయల్ డిస్క్ బ్రేక్ సిస్టమ్, కీలెస్ ఆపరేషన్, యాంటీ స్కిడ్ టెక్నాలజీ, సౌండ్ సిస్టమ్, కాలింగ్ ఆప్షన్స్, ఆన్ బోర్డ్ నావిగేషన్ అందించే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం టీఎఫ్టీ స్క్రీన్ తదితర ఫీచర్లు కూడా జత కలిపారు.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Woman Delivers Baby On Bus | బస్సులో ప్రయాణించిన గర్భిణీకి ప్రసవ వేదన.. ఆడ బిడ్డకు జన్మ
Polio Drops | పోలియో గురించి తల్లిదండ్రులు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఇవే..
Oh Na Siddayya | శంషాబాద్‌లో ఘనంగా ‘ఓ నా సిద్ధయ్య’ పాట విడుదల.. హాజరైన సోనూసూద్!
AP Elections | ఏపీలో మున్సిపల్ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి : ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా
ముగిసిన సింగరేణి కంపెనీ స్థాయి చెస్, క్యారమ్స్ పోటీలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

