Kia India | దక్షిణ కొరియా ఆటోమేజర్ కియా ఇండియా (Kia India) వచ్చే అక్టోబర్ మూడో తేదీన రెండు ప్రీమియం కార్లు భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది. కార్నివాల్ ఎంపీవీ (Carnival MPV), ఈవీ9 ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EV9 Electric SUV) కార్లు ఆవిష్కరిస్తామని తెలిపింది. ప్రస్తుతం సోనెట్ ఎస్యూవీ (Sonet SUV), సెల్టోస్ ఎస్యూవీ (Seltos SUV), కరెన్స్ ఎంపీవీ (Carens MPV), ఈవీ6 ఎలక్ట్రిక్ ఎస్యూవీ (EV6 Electric SUV) కార్లను దేశీయ మార్కెట్లో విక్రయిస్తోంది. కియా కార్నివాల్ ఎంపీవీ (Carnival MPV), కియా ఈవీ9 (Kia EV9) కార్లను తొలుత సీబీయూ (Completely Build Up) మోడల్స్ గా విక్రయిస్తుందని భావిస్తున్నారు.
కియా కార్నివాల్ ఎంపీవీ (Kia Carnival MPV) కారు ధర సుమారు రూ.50 లక్షలు (ఎక్స్ షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఈ ధరతో మార్కెట్లో పోటీ పడే కార్లేవీ ప్రస్తుతానికి లేవు. టయోటా ఇన్నోవా హైక్రాస్ హైబ్రీడ్ వర్షన్ (Toyota Innova Hycross) కారు రూ.25.97 లక్షల నుంచి రూ.30.98 లక్షల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతోంది. మరోవైపు టయోటా వెలిఫైర్ (Toyota Velifire) ధర రూ.1.22 కోట్ల నుంచి రూ.1.32 కోట్ల (ఎక్స్ షోరూమ్) మధ్య పలుకుతుంది.
భారత్ రోడ్ల కోసం రూపుదిద్దుకున్న కార్నివాల్ ఎంపీవీ (Carnival MPV) కారు 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ తో వస్తుందని తెలుస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న కార్నివాల్ కారు 2.2 లీటర్ల డీజిల్ ఇంజిన్ (200 పీఎస్ విద్యుత్, 440 ఎన్ఎం టార్క్) విత్ 8-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్‌తో అందుబాటులో ఉంటుందని భావిస్తున్నారు.
కియా ఈవీ9 (Kia EV9) కారు ధర రూ. కోటి పైనే (ఎక్స్ షోరూమ్) ఉండొచ్చునని తెలుస్తోంది. ప్రపంచంలోనే ఈవీ9 (EV9) కారు అత్యంత విలువైన కారు అని భావిస్తున్నారు. బీఎండబ్ల్యూ ఐఎక్స్ (BMW iX) కారు ధర రూ.1.39 కోట్లు (ఎక్స్ షోరూమ్) తో కియా ఈవీ9 (Kia EV9) కారు పోటీ పడుతుందని చెబుతున్నారు. స్టాండర్డ్, జీటీ-లైన్ వేరియంట్లలో గ్లోబల్ మార్కెట్లలో కియా ఈవీ9 కారు అందుబాటులో ఉంది. సింగిల్ చార్జింగ్ తో 500 కి.మీ పై చిలుకు దూరం ప్రయాణిస్తుంది. ఈ త్రీ రో ఎలక్ట్రిక్ ఎస్యూవీ లెవల్ 3 అటానమస్ డ్రైవింగ్ కెపాసిటీ కలిగి ఉంటుందని భావిస్తున్నారు.