Health On Us | హైదరాబాద్, ఫిబ్రవరి 24: ప్రముఖ హెల్త్‌కేర్ సేవల సంస్థ హెల్త్ ఆన్ అజ్ భారీ విస్తరణ ప్రణాళికను ప్రకటించింది. వచ్చే ఆరు నెలల్లో విజయవాడ, తిరుపతితోపాటు బెంగళూరులలో మూడు కేంద్రాలను నెలకొల్పాలనుకుంటున్నట్లు కంపెనీ చైర్మన్ ఎల్ రమేశ్ తెలిపారు. హైదరాబాద్‌లో మరో రెండు, బెంగళూరు సెంటర్ కలుపుకొని మొత్తం ఏడు కేంద్రాల్లో 125 పడకలకు విస్తరించాలని చూస్తున్నది. రూ.150-175 కోట్ల పెట్టుబడి పెట్టనున్నారు.