Canara Bank | 10 శాతం వృద్ధి.. కెనరా బ్యాంక్ లాభం 3,905 కోట్లు
ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,535 కోట్లుగా ఉన్న నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.3,905 కోట్లకు ఎగబాకింది.
Canara Bank | న్యూఢిల్లీ, జూలై 25: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికపు నికర లాభంలో 10 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ.3,535 కోట్లుగా ఉన్న నికర లాభం గత త్రైమాసికానికిగాను రూ.3,905 కోట్లకు ఎగబాకింది.
మొండి బకాయిలు తగ్గుముఖం పట్టడం వల్లనే లాభాల్లో రెండంకెల వృద్ధి నమోదైందని బ్యాంక్ ఎండీ కే సత్యనారాయణ రాజు తెలిపారు. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.34,020 కోట్లకు చేరుకున్నట్లు చెప్పారు అలాగే మొండి బకాయిలపై యుద్ధం ప్రకటించినట్లు, ఇక నుంచి ప్రతి త్రైమాసికంలో రూ.1,000 కోట్ల బకాయిలను వసూలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
- బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.14 శాతానికి దిగొచ్చింది. అలాగే నికర ఎన్పీఏ కూడా 1.24 శాతానికి తగ్గింది.
- మొండి బకాయిలను పూడ్చుకోవడానికి నిధుల కేటాయింపులు రూ.2,418 కోట్ల నుంచి రూ.2,171 కోట్లకు తగ్గాయి.
- ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.8,500 కోట్ల నిధుల సేకరించనున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

