Regional Rural Bank | ఒకే రాష్ట్రం.. ఒక ఆర్ఆర్బీ అమలుకు ముహూర్తం ఖరారు..!
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల నోటిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (RRB) కన్సాలిడేట్ చేయనున్నది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.
Regional Rural Bank | ఒకే రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం ఈ ఏడాది మే ఒకటి నుంచి అమలులోకి రానున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ వెల్లడించింది. ఇందుకు సంబంధించి టిఫికేషన్ విడుదల చేసింది. దాంతో 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ బ్యాంకులను (RRB) కన్సాలిడేట్ చేయనున్నది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా 11 రాష్ట్రాల్లోని 15 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ఏకీకరణకు సంబంధించిన ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇది పూర్తయితే ఈ బ్యాంకుల సంఖ్య 43 నుంచి 28కి తగ్గనున్నది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2004-05 ఆర్థిక సంవత్సరంలో ఆర్ఆర్బీల నిర్మాణాత్మక ఏకీకరణను మొదలుపెట్టింది. ఇందులో ఇప్పటి వరకు మూడు దశల్లో 2020-21 నాటికి ఆర్ఆర్బీల సంఖ్య 196 నుంచి 43కి తగ్గింది. ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ ప్రకారం.. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు చట్టం-1976లోని సెక్షన్ 23A (1) ప్రకారం, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, గుజరాత్, జమ్మూ కాశ్మీర్, కర్నాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్ రాష్ట్రాల్లో ఉన్న ఆర్ఆర్బీలు ఒకే సంస్థగా మారనున్నాయి.
ఆంధ్రప్రదేలోని చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్, సప్తగిరి గ్రామీణ బ్యాంక్‌లు.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ విలీనం చేయబడి.. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌గా మారతాయి. కొత్త బ్యాంక్ ప్రధాన కార్యాలయంలో అమరావతిలో ఉండనుండగా.. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పాన్సర్ చేయనున్నది. యూపీలోని బరోడా యూపీ బ్యాంక్, ఆర్యవర్ట్ బ్యాంక్, ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంక్ ఉత్తర ప్రదేశ్ గ్రామీణ బ్యాంక్‌లో విలీనవుతాయి. ప్రధాన కార్యాలయం బ్యాంక్ ఆఫ్ బరోడా స్పాన్సర్షిప్ కింద లక్నోలో ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో, బంగియా గ్రామీణ వికాస్, పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్, ఉత్తరబంగా ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్ విలీనం చేయబడి పశ్చిమ బెంగాల్ గ్రామీణ బ్యాంక్‌గా మారుతాయి.
ఇదే తరహాలో మిగతా ఎనిమిది రాష్ట్రాల్లోనూ ఆర్ఆర్బీలు విలీనమవుతాయి. ఆర్ఆర్బీలో కేంద్రానికి 50శాతం వాటా ఉంటుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులకు స్పాన్సర్ వాటా 35శాతం, రాష్ట్రాలకు 15శాతం ఉంటుంది. సవరించిన చట్టం ప్రకారం.. వాటాను తగ్గించిన తర్వాత కూడా.. కేంద్రం, స్పాన్సర్ బ్యాంకుల వాటా 51శాతం కంటే తక్కువ ఉండకూడదు. బ్యాంకులకు రూ.2వేల కోట్ల మూలధనం ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, అన్ని ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు రూ.2వేల కోట్ల అధీకృత మూలధనం ఉంటుంది. ఇదిలా ఉండగా.. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నకారు రైతులు, వ్యవసాయ కూలీలు, కళాకారులకు రుణాలు, ఇతర బ్యాంకింగ్ సేవలు అందించేందుకు ఆర్ఆర్బీ యాక్ట్ కింద ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఏర్పాటు చేశారు. ఇందులో కేంద్రానికి 50శాతం, స్పాన్సర్ బ్యాంకులకు 30శాతం, రాష్ట్ర ప్రభుత్వాలకు 15శాతం వాటా ఉంటుంది. ప్రస్తుతం 26 రాష్ట్రంలో 43 ఆర్ఆర్బీలు ఉండగా.. ఈ సంఖ్య 28 తగ్గుతుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళ సినీ పరిశ్రమకు విజయ్ సర్కార్ గుడ్‌న్యూస్.. రోజుకు ఆరు షోలకు అనుమతి,కాని దానికి మాత్రం నో!
Kiran Abbavaram | బాల్యపు జ్ఞాపకాలను గుర్తుచేసే ‘సమ్మర్ హాలిడేస్’.. కిరణ్ అబ్బవరం ఆసక్తికర వ్యాఖ్యలు
Anirudh-Kavya | అనిరుధ్–కావ్య మారన్ పెళ్లి పిలుపు ప్రత్యేకం.. ఒక్కో ఆహ్వాన పత్రిక ఖర్చు రూ.20 వేల వరకు!
Sreeleela | రజినీకాంత్ ‘ధర్మన్’లో శ్రీలీల.. స్పెషల్ ప్రీ లుక్‌తో హింట్ ఇచ్చిన మేకర్స్!
EAPCET Office | గెస్ట్‌హౌస్‌గా ఎప్‌సెట్ ఆఫీస్.. అడ్మిషన్ల వేళ జేఎన్టీయూ సంచలన నిర్ణయం!
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

