హైదరాబాద్ సిటీబ్యూరో, మే 10 (నమస్తే తెలంగాణ): ది ఇండియా బ్లాక్‌చైన్ యాక్సిలరేటర్ కార్యక్రమానికి 14 ప్రారంభ దశలో ఉన్న వెబ్3 స్టార్టప్‌లు ఎంపికయ్యాయి. కాయిన్ స్విచ్, లుమోస్ ల్యాబ్స్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని గత ఏడాది ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దేశ, విదేశాలకు చెందిన 270 స్టార్టప్‌ల నుంచి దరఖాస్తులు రాగా, 14 అత్యుత్తమ స్టార్టప్‌లను ఎంపిక చేశామని తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రూ.5.50 కోట్ల గ్రాంట్ పూల్‌తోపాటు గో టు మార్కెట్, మెంటార్షిప్ అంశాల్లో మద్దతు ఉంటుందని చెప్పారు. ఈ స్టార్టప్‌లు ఫిన్‌టెక్, ఎంటర్టైన్మెంట్, టూలింగ్, మౌలిక వసతులు, అగ్రిటెక్, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్‌లలో బ్లాక్‌చైన్ టెక్నాలజీలను వినియోగించేలా పరిశోధనలు చేస్తాయన్నారు.
ఎంపికైన స్టార్టప్లివే..