న్యూఢిల్లీ, డిసెంబర్ 20: యూ ట్యూబ్ క్రియేటర్లు భారత్ ఆర్థికాభివృద్ధికి భారీగా ఆదాయాన్ని సమకూరుస్తున్నారని, యూట్యూబ్ క్రియేటివ్ వ్యవస్థ పెద్ద ఎత్తున ఉపాధి కల్పిస్తున్నదని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్ నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది.
2021లో భారత్ జీడీపీలో రూ.10,000 కోట్ల భాగస్వామ్యం యూట్యూబర్లదేనని, అదే ఏడాదిలో 7,50,000 పూర్తికాలపు ఉపాధిని యూట్యూబ్ క్రియేటివ్ వ్యవస్థ కల్పించినట్టు అధ్యయనం పేర్కొంది.