Gold Rates | దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం ధర సోమవారం మళ్లీ పెరిగింది. 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.600 పెరిగి రూ.73,150 పలికింది. ఆభరణాల తయారీ కోసం వినియోగించే 22 క్యారట్ల బంగారం పది గ్రాములు ధర రూ.550 పుంజుకుని రూ.67,050 వద్ద స్థిర పడింది. ఈ నెల ఒకటో తేదీ నుంచి బంగారం ధర 5.43 శాతం పెరిగింది. ఈ నెల ఒకటో తేదీన 24 క్యారట్ల బంగారం తులం ధర రూ.63,380 పలికితే, సోమవారం (ఏప్రిల్ 15) రూ.73,150లకు దూసుకెళ్లింది. కిలో వెండి ధర రూ.500 పెరిగి రూ.86 వేల వద్ద స్థిర పడింది. గత 15 రోజుల్లో కిలో వెండి ధర సైతం రూ.78,600 నుంచి రూ.86 వేలకు పెరిగింది.
నగరం — 22 క్యారట్స్ — 24 క్యారట్స్
చెన్నై – 67,900 – 74,070
ముంబై – 67,050 -73,150
ఢిల్లీ – 67,200 -73,300
కోల్కతా – 67,050 – 73,150
బెంగళూరు – 67,050 – 73,150
హైదరాబాద్ – 67,050 -73,150
తిరువనంతపురం – 67,050 -73,150
పుణె – 67,050 – 73,150
వడోదర – 67,100 – 73,200
అహ్మదాబాద్- 67,100 – 73,200
జైపూర్ -67,200 – 73,300
లక్నో – 67,200 – 73,300
కోయంబత్తూర్ – 67,900 -74,070
మధురై – 67,900 – 74,070
విజయవాడ – 67,050 -73,150
పాట్నా – 67,100 – 73,200
నాగ్పూర్ – 67,050 – 73,150
చండీగఢ్ – 67,200 – 73,300
సూరత్ – 67,100 -73,200
భువనేశ్వర్ – 67,050 -73,150