Mythen | ప్రస్తుతం ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణ కోసం పెట్రోల్/ డీజిల్/ సీఎన్జీకి బదులు ఆల్టర్నేటివ్ ఇంధనం.. ప్రత్యేకించి ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం వైపు మళ్లుతున్నారు. అత్యంత స్పీడ్‌తో దూసుకెళ్లే సామర్థ్యం గల ఈవీ కార్ల తయారీలో పోటీ పెరుగుతున్నది.
ఇప్పటి వరకూ ఏ సంస్థ కూడా శరవేగంగా దూసుకెళ్లే ఈవీ కారును డిజైన్ చేసి తయారు చేయలేకపోయాయి. కానీ స్విట్జర్లాండ్ విద్యార్థులు 30 మంది కేవలం 0.956 సెకన్లలోనే 100 కి.మీ వేగంతో దూసుకెళ్లే ఎలక్ట్రిక్ కారును డిజైన్ చేసి, ఆవిష్కరించారు. శరవేగంగా దూసుకెళ్లే ఎలక్ట్రిక్ ప్రొటోటైప్ రేసింగ్ కారుగా దీనికి ‘గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్’ గుర్తింపునిచ్చింది. ఈ కారుకు సదరు విద్యార్థులు ‘మిథన్’ అనే నామకరణం కూడా చేశారు.
ఈ విద్యార్థులు జ్యురిచ్ అకడమిక్ మోటార్ స్పోర్ట్స్ క్లబ్‌లోనూ భాగస్వాములే. స్విట్జర్లాండ్‌లోని జ్యురిచ్ సబర్బన్ దుబెన్దార్ఫ్ లో ఈ రికార్డు నమోదైంది. స్విస్ ఫెడరల్ ఇన్ స్టిట్యూ ఆఫ్ టెక్నాలజీ జ్యురిచ్ (ఈటీహెచ్జడ్), లుసెర్న్ యూనివర్సిటీ ఆఫ్ అప్లయిడ్ సైన్సెస్ విద్యార్థులు సంయుక్తంగా ఒక టినీ వర్క్ షాప్‌లో ఈ ‘మిథన్’ కారు తయారు చేశారు.
పూర్తిగా స్ట్రార్చ్తో తయారు చేసిన ఈ కారు చూడటానికి గో-కార్ట్’లా కనిపిస్తుంది. దీని బరువు 140 కిలోలే. మిథన్ తయారీకి పూర్తిగా లైట్ వెయిట్ కార్బన్, అల్యూమినియం హానీ కంబ్ స్ట్రక్చర్ వినియోగించారు. దీంతోపాటు ఫోర్ వీల్ హబ్ ఎలక్ట్రిక్ మోటార్ కూడా డెవలప్ చేశారు. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 326 హెచ్‌పీ విద్యుత్ వెలువరిస్తుంది. ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డులు మొదలు చేసిస్ నంబర్, బ్యాటరీ, ఈ కారులోని ప్రతి విడి భాగాన్ని డుబెన్ డార్ఫ్ వర్క్‌షాప్‌లోనే డెవలప్ చేశారు.
స్విట్జర్లాండ్ ఇన్నోవేషన్ పార్కులో ప్రయోగాత్మకంగా పరీక్షించారు. 12.3 మీటర్ల రేస్ గ్రౌండ్లో మిథన్ కారును డ్రైవ్ చేయగా 0.956 సెకన్లలోనే లక్ష్యాన్ని చేరుకున్నది. గతేడాది సెప్టెంబర్ లోనే యూనివర్సిటీ ఆఫ్ స్టట్గర్ట్ యూనివర్సిటీ విద్యార్థులు ఆవిష్కరించిన కారు 1.461 సెకన్లలో 100 కి.మీ స్పీడ్ అందుకుంటుంది. ఫార్ములా వన్ రేస్ కార్ల కంటే శరవేగంగానూ దూసుకెళ్లుతుంది ‘మిథన్’. సాధారణంగా ఫార్ములా వన్ రేస్ కారు 2.8 సెకన్లలో 100 కి.మీ. స్పీడ్‌తో ప్రయాణిస్తుంది.