న్యూఢిల్లీ, ఫిబ్రవరి 6: సోనాలికా సరికొత్తగా గోల్డ్ సిరీస్ ట్రాక్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. భద్రతకు పెద్దపీట వేయడంతోపాటు నిలకడ, రైతులు కోరుకుంటున్న విధంగా ఈ నయా ట్రాక్టర్లను తీర్చిదిద్దినట్టు ఇంటర్నేషనల్ ట్రాక్టర్స్ జాయింట్ ఎండీ రామన్ మిట్టల్ తెలిపారు.
ఈ నూతన సీరిస్లో భాగంగా విడుదల చేసిన రెండు రకాల ట్రాక్టర్లు 3 సిలిండర్ ఈ3.5 ఇంజిన్, 3532 సీసీ కెపాసిటీ, 20 గేర్లు, 2,200 కిలోల సరుకును తీసుకెళ్లనున్నది.