హైదరాబాద్, ఆగస్టు 21 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారి నేపథ్యంలో అన్ని రంగాలు ఆన్లైన్ బాట పట్టక తప్పట్లేదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం సైతం ఇదే తోవలో నడుస్తున్నది. కొత్త ట్రెండ్‌ను ఫాలో అవుతూ డిజిటల్, వర్చువల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నది. సాధారణంగా స్థిరాస్తి కొనుగోలుదారులు నేరుగా సైట్‌కు వెళ్లి ప్రత్యక్షంగా చూసిన తర్వాతే ముందడుగు వేస్తారు. అయితే కరోనా నేపథ్యంలో సైట్ విజిటింగ్లు తగ్గాయి. స్థిరాస్తుల కొనుగోలుకు ఆన్లైన్లో అన్వేషణలు పెరిగాయి. దీంతో బడా సంస్థల నుంచి చిన్న బిల్డర్ల వరకు ఇప్పుడు అందరూ డిజిటల్ జపం చేస్తున్నారు.
ఆన్లైన్లో సెర్చ్
స్థిరాస్తుల కొనుగోలుకు ఆన్లైన్లో వెతికేవారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నదని ‘హౌసింగ్.కామ్’ సంస్థ తమ నివేదికలో వెల్లడించింది. ఇంటి నుంచే ప్రాపర్టీ వివరాలను తెలుసుకొని వర్చువల్‌గా వాటిని పరిశీలించాలని చాలామంది భావిస్తున్నారు. గతంలో ప్రధాన నగరాలకే పరిమితమైన ఈ ట్రెండ్ ఇప్పుడు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాలకూ విస్తరించిందని పేర్కొన్నది. ఆన్లైన్ వెతుకులాటపై దేశవ్యాప్తంగా 42 నగరాలు, పట్టణాల్లో సర్వే నిర్వహించగా హైదరాబాద్ టాప్-5లో చోటు దక్కించుకున్నది. ఢిల్లీ మొదటి స్థానంలో నిలిచింది.
ప్రాపర్టీ పోర్టల్స్
నిత్యావసరాల మాదిరిగానే ఇండ్లు, ఫ్లాట్లు, ప్లాట్లు, వ్యవసాయ భూముల అమ్మకానికి కూడా పోర్టల్స్ పెరుగుతున్నాయి. గతంలో 99ఏకర్స్.కామ్ వంటి ఒకటి, రెండు పోర్టల్స్ మాత్రమే ఉండగా.. ఇప్పుడు పదుల సంఖ్యలో అందుబాటులోకి వచ్చాయి. కాస్త పేరున్న నిర్మాణ సంస్థలు, రియల్టీ సంస్థలు సొంతంగా వెబ్సైట్లను ప్రారంభించాయి. ఆయా ఆస్తుల వివరాలతోపాటు ఫొటోలు, వీడియోలను కూడా అప్లోడ్ చేస్తున్నారు.
డిజిటల్ లీడ్ మేనేజ్మెంట్
రియల్ ఎస్టేట్ ఏజెంట్లు తమ క్లయింట్లను నేరుగా కలువకుండా కాల్స్, మెసేజ్‌లు, మెయిల్స్, సోషల్ మీడియా ద్వారా సంప్రదిస్తున్నారు. కంపెనీలు బల్క్ మెసేజ్‌లు పంపుతున్నాయి. మరికొందరైతే కస్టమర్లతో జూమ్ మీటింగ్ ద్వారా తమ