హైదరాబాద్, ఏప్రిల్ 23: ప్రముఖ ఏసీల తయారీ సంస్థ దైకిన్..హైదరాబాద్లో నూతన ఎక్స్పీరియన్స్ సెంటర్ను ప్రారంభించింది. దక్షిణాది భారతంలో అతిపెద్ద ఈ సెంటర్ను శ్రీ కంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సంస్థ నిర్వహించనున్నది. ఈ సందర్భంగా దైకిన్ ఏసీ ఇండియా డైరెక్టర్ సంజయ్ గోయల్ మాట్లాడుతూ..దేశవ్యాప్తంగా ఏండలు తీవ్రతరం కావడంతో ఏసీల వినిమయం భారీగా పుంజుకున్నదన్నారు. శ్రీకంఫర్ట్ ఎయిర్ ప్రొడక్ట్స్ అండ్ సర్వీసెస్ సీఈవో కల్యానరామన్ మాట్లాడుతూ..ప్రస్తుతం సంస్థలో 250కి పైగా ఉపాధి పొందుతున్నారని, 2030 నాటికి ఈ సంఖ్యను వెయ్యికి పెంచుకోనున్నట్టు ప్రకటించారు. అలాగే రూ.110 కోట్లుగా ఉన్న కంపెనీ టర్నోవర్ రూ.350 కోట్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.