మొటిమలు మాయం!

చంద్రబింబం లాంటి వదనం. కానీ, మొటిమలతో ముఖారవిందం వికారంగా మారిపోయిందని బాధపడుతుంటారు. పింపుల్స్‌ను తగ్గించుకోవడానికి రకరకాల క్రీములు వాడుతుంటారు. కానీ, మొటిమలు రావడానికి గల కారణాలు తెలుసుకొని, వాటిని నివారించగలిగితే ఈ సమస్య చాలా వరకు తీరుతుంది.
- జిడ్డు చర్మం ఉన్నవారికి మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోజులో నాలుగైదుసార్లు చల్లటి నీటితో ముఖం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఉదయం, సాయంత్రం రోజ్‌వాటర్‌తో ముఖం కడిగితే మొటిమల తీవ్రత తగ్గుతుంది.
- నూనె పదార్థాలు మొటిమలకు కారణం అవుతాయి. రెగ్యులర్ డైట్లో నూనె శాతం తగ్గించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నీళ్లు బాగా తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి.
- డిప్రెషన్లో ఉన్నవారికి సైతం మొటిమలు వచ్చే అవకాశం ఉందని పలు పరిశోధనలు చెబుతున్నాయి. మానసికంగా సంతోషంగా ఉండాలి.
- ఆహారం విషయంలో సమయపాలన పాటించకపోవడం వల్ల కాలేయంలో ఉత్పత్తి అయ్యే యాసిడ్లు మొటిమలకు దారి తీస్తాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే, సమయానికి తగు ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.
- కొందరు మొటిమలను గిచ్చేస్తుంటారు. దీనివల్ల ఇన్ఫెక్షన్ పెరగడమే కాకుండా ఆ ప్రాంతంలో చర్మంపై గుల్లలు ఏర్పడతాయి. మొటిమలు ఉన్న వాళ్లు టమాటా, నిమ్మ, నారింజ వంటి సిట్రస్ పాళ్లు ఎక్కువగా ఉండే పండ్లు, కూరగాయల ప్యాక్‌లు వేసుకోకూడదు.
- సాలిసిలిక్ ఆయిల్, టీట్రీ ఆయిల్ కలిగిన ఫేస్‌వాష్‌లను ఉపయోగించడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయి. కలబంద జెల్‌తో కస్తూరి కలిపి ఫేస్‌ప్యాక్‌గా వేసుకున్నా మొటిమలకు చెక్ పెట్టవచ్చు.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

