HomeBeauty-tipsSkin Care Tips And Benefits Of Glycerin Hand Cream
గ్లిజరిన్‌తో నిగారింపు
సినిమాల్లో నటీనటుల కన్నుల వెంట నీళ్లు తెప్పించే గ్లిజరిన్‌ను సబ్బుల్లోనూ, మాయిశ్చరైజర్లలోనూ ఉపయోగిస్తారు. దీన్ని పద్ధతిగా ఉపయోగిస్తే.. చర్మం మెరిసిపోతుంది.
సినిమాల్లో నటీనటుల కన్నుల వెంట నీళ్లు తెప్పించే గ్లిజరిన్‌ను సబ్బుల్లోనూ, మాయిశ్చరైజర్లలోనూ ఉపయోగిస్తారు. దీన్ని పద్ధతిగా ఉపయోగిస్తే.. చర్మం మెరిసిపోతుంది.
ముల్తానీ మట్టిలో చెంచా గ్లిజరిన్, కొన్ని నీళ్లూ కలిపి మెత్తటి మిశ్రమంలా చేసుకోవాలి. దాన్ని ముఖానికి రాసుకుని ఇరవై నిమిషాలపాటు ఆరనివ్వాలి. తరవాత చన్నీళ్లతో కడిగేసుకుంటే ముఖంపై
పేరుకున్న మురికి తొలగిపోయి, చర్మం తాజాగా మారుతుంది.
స్నానం చేసే నీళ్లలో లేదా చర్మ సంరక్షణకు వాడే క్రీములూ, క్లెన్సర్‌లలో కొంచెం గ్లిజరిన్‌ని కలిపి వాడుకోవచ్చు. దీనివల్ల చర్మం పొడిబారదు, నిగారింపు కోల్పోదు. చర్మం మృదువుగా మారుతుంది కూడా.
చర్మం పొడిబారే సమస్య ఉన్నవారు రాత్రి పూట కప్పు నీళ్లలో చెంచా గ్లిజరిన్ కలిపి ముఖానికి రాసుకుని ఉదయాన్నే శుభ్రపరుచు కుంటే సరి. చర్మం నునుపుగా మారుతుంది.