Laser Treatment | లేజర్ ట్రీట్మెంట్తో కాళ్లు, చేతుల మీది వెంట్రుకలు తొలగించుకోవడం మంచిదేనా?
Laser Treatment | అవును, ఇటీవలి కాలంలో లేజర్ కిరణాల ద్వారా చికిత్సలు ఎక్కువ అయ్యాయి. నొప్పి లేని విధానం కావడం వల్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. షేవింగ్, వ్యాక్సింగ్లాంటి పద్ధతుల్లో మళ్లీ మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. అదే లేజర్ విధానంలో శాశ్వతంగా తొలగించుకోవచ్చు.
Laser Treatment | ఇటీవలి కాలంలో లేజర్ చికిత్స ద్వారా వ్యక్తిగత భాగాలు, చంకలు, కాళ్లూ చేతుల మీది వెంట్రుకలను శాశ్వతంగా తొలగిస్తున్నారు. ఇది సురక్షితమేనా?
– ఓ పాఠకురాలు
అవును, ఇటీవలి కాలంలో లేజర్ కిరణాల ద్వారా చికిత్సలు ఎక్కువ అయ్యాయి. నొప్పి లేని విధానం కావడం వల్ల చాలా మంది మొగ్గు చూపుతున్నారు. షేవింగ్, వ్యాక్సింగ్లాంటి పద్ధతుల్లో మళ్లీ మళ్లీ వెంట్రుకలు మొలుస్తాయి. అదే లేజర్ విధానంలో శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఖరీదైన వ్యవహారమే అయినా, ఎంచుకుంటున్నవారి సంఖ్య పెరుగుతున్నది. వ్యక్తిగత భాగాలైనా, బయటి ప్రాంతమైనా లేజర్ చికిత్స వల్ల ప్రమాదం అని చెప్పలేం. అయితే, కిరణాల తీవ్రత ఎక్కువైతే చర్మం కాలిపోయే ప్రమాదం ఉంది.
గాయాలకూ ఆస్కారం ఉంది. కాబట్టి, బాగా అనుభవం ఉన్న సర్టిఫైడ్ సంస్థ దగ్గర చేయించుకోవడం మంచిది. డెర్మటాలజిస్టు సలహా తీసుకోవాలి. ఒక వేళ చికిత్స కూడా వాళ్లే చేస్తే అక్కడే చేయించుకోవడం మేలు. ఎందుకంటే.. ఎక్కడి చర్మం ఎంత సున్నితం, ఎవరి చర్మం తీరు ఏమిటి అన్నది అర్థం చేసుకుని చికిత్స చేయగలరు. దానివల్ల తీవ్ర దుష్ఫలితాలకు అవకాశం తక్కువ. అర్హత, అనుభవం.. రెండూలేని వ్యాపార సంస్థల జోలికి వెళ్లకపోవడమే మంచిది.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

