Bottle gourd Beauty Benefits | ఆనపకాయ చూడ్డానికి మాయలఫకీరు చేతిలోని మంత్రదండంలా అనిపిస్తుంది. నిజానికి, అదో సౌందర్య అస్త్రం. ఆరోగ్యానికి, అందానికి వారధిగా పనిచేసే ఆనపకాయ విశేషాలు..
ఆనపకాయ పోషకాల నిధి. చర్మంపై ముడతలను నివారిస్తుంది. యాంటీ ఏజింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది. నిత్యం ఆనపకాయ రసం తాగితే అకాల వృద్ధాప్యాన్ని అడ్డుకోవచ్చు.
ఆనపకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజాలు, విటమిన్స్ పుష్కలం. ఇవి చర్మానికి సహజమైన రక్షణ ఇస్తాయి. ఫేస్మాస్క్గా వాడితే నిగారింపు సొంతం అవుతుంది.
ఆనపకాయను మెత్తగా చేసి కురుపులు, మచ్చలు ఉన్నచోట రుద్దితే చర్మం సాధారణ రంగులోకి వస్తుంది. జిడ్డు సమస్య ఉన్నవారికి ఔషధంలా పనిచేస్తుంది.
ఆనపకాయకు రక్తాన్ని శుద్ధి చేసే గుణమూ ఉంది. ఆనపకాయ రసం, దోసకాయ రసం, తేనె మిశ్రమాన్ని ముఖానికి పట్టిస్తే చర్మంపై మలినాలు తొలగిపోతాయి. సూర్యుడి నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాలు చర్మానికి హాని కలిగించకుండా ఈ కాయ అడ్డుకుంటుంది. బయట తిరిగేవారు తరచూ ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసుకుంటే సమస్య ఉండదు.
ఆనపకాయ వల్ల కేశ సంపద మెరుగు అవుతుంది. జుట్టు ఒత్తుగా తయారవుతుంది. బాలనెరుపు అదుపులోకి వస్తుంది.
“ముద్దబంతి పువ్వుతో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది”