ఎన్ని డియోడరెంట్లు వాడినా ఒంటి నుంచి దుర్వాసన వస్తుందా? అయితే ఈ చిట్కాలు ట్రై చేయండి
Body odour | ఒంటి దుర్వాసనను పోగొట్టుకోవడానికి చాలామంది డియోడరెంట్లు, పర్ఫ్యూమ్ల మీద ఆధారపడతారు. అసలు ఆ సమస్య ఎందుకొచ్చిందో తెలుసుకుంటే పరిష్కారమూ సులభమే. ఆ ప్రయత్నంలో పనికొచ్చే చిట్కాలు..
ఎసెన్షియల్ ఆయిల్
దుర్గంధ సమస్య ఉన్నవారు రెండుపూటలా స్నానం చేయడం మంచిది. ఎండ ఎక్కువగా ఉన్న రోజుల్లో చన్నీటి స్నానం శరీర ఉష్ణోగ్రతను సమతులం చేస్తుంది. అలాగే స్నానం చేసే నీళ్లలో రెండు మూడు చుక్కల ఎసెన్షియల్ ఆయిల్ కలిపితే మరీ మంచిది. లావెండర్, రోజ్మేరీ, టీట్రీలాంటి గాఢ తైలాలు శరీర దుర్గంధాన్ని దూరం చేస్తాయి.
టమాట, వేప మిశ్రమం
దుర్వాసనకు బ్యాక్టీరియా ఓ కారణం. అందుకే ఈ సూక్ష్మజీవుల్ని పారదోలడానికి వేప మిశ్రమం బాగా పనికొస్తుంది. పది వేపాకుల్ని తీసుకుని, మంచినీళ్లలో కాసేపు నానబెట్టి మిక్సీపట్టి చంకలు, అరికాళ్లలో రాసి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. టమాటాను పల్చటి ముక్కల్లా లేదా పేస్టులా చేసి దుర్వాసన వెదజల్లే చోట రాయవచ్చు. దీనివల్లా మంచి ఫలితం ఉంటుంది.
ఆలూ మేలు
ఆలుగడ్డను గుండ్రటి ముక్కలుగా తరిగి.. చంక లేదా అరికాళ్లలో పదినిమిషాల పాటు రుద్ది తర్వాత చల్లటి నీళ్లతో కడిగేయాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తే దుర్వాసన మాయం అవుతుంది. లేదంటే ఆలుగడ్డ పేస్ట్ కూడా రాసుకోవచ్చు.
కలబంద గుజ్జుతో
కలబంద చెట్టు నుంచి గుజ్జు తీసి అందులో దూది లేదా గుడ్డ నానబెట్టి.. కాసేపు అలానే ఉంచాలి. ఆ వస్త్రంతో దుర్వాసన వచ్చే శరీర భాగాల్ని శుభ్రపరిస్తే క్రమంగా సమస్య దూరం అవుతుంది.
జల చికిత్స
శరీరంలోని విష పదార్థాలను బయటికి పంపడంలో మంచినీళ్ల పాత్ర ప్రధానం. వాతావరణంలోని రకరకాల కాలుష్యాలు శరీర దుర్గంధానికి కారణం కావచ్చు. కాబట్టి మంచినీళ్ల్లు, పండ్ల రసాలు పుష్కలంగా తీసుకోవాలి. నానబెట్టిన మెంతులు తిన్నా మంచిదే.
Read More :
వీటిని తింటే చర్మంపై ముడతలే ఉండవు.. ఏజ్ పెరిగినా అందంగా కనిపిస్తారు!!”
Read Today's Latest Zindagi News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- Health
- smell
RELATED ARTICLES
తాజా వార్తలు
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
Harish Rao | ఒక చేత్తో ఉచిత ప్రయాణం.. మరో చేత్తో డబుల్ దోపిడీ. ఇదేనా మీ ప్రజాపాలన.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ధ్వజం
Harish Rao | జర్మనీలో ఉద్యోగాల పేరుతో మోసం.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

