ముద్దబంతి పువ్వుతో ఇలా చేస్తే మీ ముఖం మెరిసిపోతుంది
Marigold Face Mask | పచ్చగా బొద్దుగా ఉండే ఆడపిల్లల్ని ముద్దబంతి పువ్వుతో పోలుస్తారు. నిజమే బంతి పువ్వును చూస్తే తెలుగమ్మాయే గుర్తొస్తుంది. ఆ ముద్దొచ్చే పువ్వు మగువల సౌందర్యానికి మెరుగులద్దేందుకూ పనికొస్తుంది. ఫేస్‌ప్యాక్ కూడా చేసుకోవచ్చు.
ముద్దబంతి పువ్వులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికం. ఇది సహజసిద్ధ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తూ, మేనిఛాయను మెరుగు పరుస్తుంది. చర్మానికి పోషణనిచ్చే ఔషధగుణాలు ఇందులో ఉన్నాయి. అందుకే మొటిమలు, దద్దులు, ఎగ్జిమాలాంటి చర్మ సంబంధ ఇన్ఫెక్షన్లు, ఇతర వ్యాధుల చికిత్సలో తరచూ ఉపయోగిస్తారు. ఇందులో అధికంగా ఉండే యాంటీ సెప్టిక్ గుణాలు చర్మ సమస్యలను దూరం చేసేందుకు సాయపడతాయి. ఆయుర్వేద గ్రంథాల్లోనూ ముద్దబంతి చికిత్స ప్రస్తావన ఉంది.
ఫేస్‌ప్యాక్ ఇలా..
ముద్దబంతి పువ్వును మిక్సీలో వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. దానికి పెరుగు, తేనె, చందనం పొడి, నిమ్మరసం కలపాలి. చల్లటి నీళ్లతో ముఖాన్ని శుభ్రపరచుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని రాయాలి. 15 నుంచి 20 నిమిషాలు ఆగి, గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇంట్లో సులభంగా చేసుకోగలిగే ఈ ఫేస్‌ప్యాక్‌ను వారానికి రెండుసార్లు వేసుకోవడం వల్ల మెరుగైన ఫలితాలు ఉంటాయి.
Read More :
“మొటిమలు తగ్గి చర్మం మెరవాలా? అయితే వీటి గురించి తెలుసుకోండి”
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
- Tags
- beauty tips
- face pack
- Marigold
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

