Toenails changing colour | కాలిగోళ్లు రంగు మారుతున్నాయా? జాగ్రత్త.. ఇదే కారణం కావొచ్చు?
చేతులు, కాళ్లు, కాలి గోర్లను అందంగా ఉంచుకునేందుకు కొందరు మెనిక్యూర్, పెడిక్యూర్ చేయించుకుంటూ ఉంటారు. మరికొందరు కాలిగోర్లను నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే, వాటిని అప్పుడప్పుడూ పరిశీలిస్తూ ఉండాలని అంటున్నారు నిపుణులు. కాలి గోర్లు రంగుమారితే అప్రమత్తం కావాలని సూచిస్తున్నారు. ఇది కాలిగోళ్లకు తీవ్ర నష్టం కలిగించే అవకాశం ఉందని చెబుతున్నారు. కాలి గోళ్లు రంగు పాలిపోవడం, మందంగా మారడం, విరిగిపోవడానికి ఫంగల్ ఇన్ఫెక్షనే కారణమని నిపుణులు చెబుతున్నారు. ఒనికోమైకోసిస్ అని పిలిచే ఈ ఇన్ఫెక్షన్ చేతి గోళ్ల కంటే కాలిగోళ్లలో ఎక్కువగా కనిపిస్తాయి. వైద్యుల ప్రకారం, ఒనికోమైకోసిస్‌కు కారణమయ్యే ఫంగస్ జీవి డెర్మాటోఫైట్స్.. శరీరంలోని కెరాటిన్‌ను తీసుకొని పెరుగుతాయి.

ఈ ఇన్ఫెక్షన్ గోరు రంగును పారదర్శకంగా పసుపు, గోధుమ, ఆకుపచ్చ, నలుపు రంగులోకి మారుస్తుంది. ఎక్కువగా వృద్ధులు, మహిళలు, మధుమేహం, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ లేదా గుండె జబ్బులున్నవారిలో ఈ రుగ్మత కనిపిస్తుంది. ఒనికోమైకోసిస్‌కు ఇతర కారణాలు వేసవిలో చెమటలు పట్టడం, చెప్పులు లేకుండా నడవడం, గోరు దగ్గర గాయాలు, కోతలను చికిత్స చేయకుండా వదిలేయడమని నిపుణులు పేర్కొన్నారు. ఈ ఇన్ఫెక్షన్ను నివారించేందుకు కొన్ని చిట్కాలు తెలిపారు.
- కాలి వేళ్లను శుభ్రంగా ఉంచుకోవాలి. గోళ్లను ఎప్పటికప్పుడూ కత్తిరిస్తూ ఉండాలి.
- గోరు చుట్టుపక్కల గాయాలు కాకుండా చూసుకోవాలి. కోతలు, గాయాలుంటే అవి త్వరగా మానేందుకు యాంటీబయాటిక్ క్రీమ్స్ రాయాలి.
- వేళ్ల మధ్య చెమట పేరుకుపోకుండా ఉండేందుకు చేతులు, కాళ్లను క్రమం తప్పకుండా కడగాలి. ఎల్లప్పుడూ వాటిని పొడిగా ఉండేలా చూసుకోవాలి.
- రసాయనాలతో కూడిన చౌకైన, నాణ్యతలేని నెయిల్ పాలిష్‌ను వాడొద్దు.
- ఎల్లప్పుడూ మంచి నాణ్యత గల బూట్లు, చెప్పులు ధరించాలి.
- ఇన్ఫెక్షన్ నుంచి బయటపడటానికి సహాయపడే యాంటీ ఫంగల్ క్రీమ్‌లను అప్లై చేయాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం