వలయాలపై శీతలాస్త్రం
అందంగా కనిపించాలని అందరికీ ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ ముఖంపై ముడతలు, కండ్ల కింద వలయాలు వచ్చి సౌందర్యాన్ని దూరం చేస్తాయి. ఈ ముడతలను, ఆ వలయాలను చన్నీళ్లు తరిమికొడతాయి. మంచు ముక్కలను నమ్ముకున్నా ఫలితం కనిపిస్తుంది. ఎందుకు ఆలస్యం శీతలాస్ర్తాన్ని సంధించండి ఇలా..
- వెడల్పాటి గిన్నెలో చన్నీళ్లు పోసి.. అందులో 20 సెకండ్లపాటు ముఖాన్ని ఉంచండి. శ్వాస తీసుకోవడం ఇబ్బంది అయితే, పదేసి సెకండ్ల చొప్పున రెండు, మూడుసార్లు ముఖం అంతా మునిగేలా తలను నీళ్లలో ఉంచాలి. తర్వాత మెత్తటి వస్త్రంతో ముఖాన్ని తుడుచుకోవాలి. ఉదయం, సాయంత్రం ఇలా చేయడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.
- చల్లని నీళ్లతో ముఖం కడగడం వల్ల చర్మం బిగుతుగా మారి ముడతలు తగ్గుముఖం పడతాయి. మొటిమలు, మచ్చలు కూడా తగ్గుతాయి. రక్తప్రసరణ మెరుగై చర్మం మెరుస్తుంది.
- చన్నీళ్లు చర్మంపై ఉండే మృతకణాలను తొలగిస్తాయి. దుమ్ము, ధూళి, మేకప్ వల్ల మూసుకుపోయిన స్వేదరంధ్రాలను తెరుస్తాయి. ఫలితంగా చర్మానికి మంచి నిగారింపు వస్తుంది. కండ్ల కింద ఏర్పడే వలయాలకూ చన్నీళ్లు మంచి ఔషధంగా పనిచేస్తాయి. మంచుముక్కలతో ముఖాన్ని రుద్దడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.
- అయితే, నీళ్లు అతి చల్లగా లేకుండా చూసుకోవాలి. అంతేకాదు, మరీ ఎక్కువసేపు ఉంచొద్దు. చన్నీళ్లలో ముఖం ఉంచేముందు గోరువెచ్చని నీటితో ముఖంపై ఉన్న మేకప్‌ను పూర్తిగా కడిగేసుకోవాలి.
Read Today's Latest Beauty-tips News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

