అమరావతి : టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ను(Allu Arjun) అరెస్టు చేయడాన్ని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ ( YS Jagan) తీవ్రంగా ఖండించారు. పుష్ప -2 సినిమా ( Puspa- 2) బెనిఫిట్ షో సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్ల ఆ కుటుంబానికి జరిగిన నష్టం ఎవరూ తీర్చలేనిదని ట్విట్ (Tweet) చేశారు.
ఘటనపై అల్లు అర్జున్ తన విచారాన్ని వ్యక్తంచేసి, ఆ కుటుంబానికి అండగా ఉంటానంటూ బాధ్యతాయుతంగా వ్యవహరించారని తెలిపారు. అయితే ఈ ఘటనకు నేరుగా అతడ్ని బాధ్యుడ్ని చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తొక్కిసలాట ఘటనలో తన ప్రమేయం లేకపోయినా అర్జున్‌పై క్రిమినల్ కేసులు బనాయించి, అరెస్టు చేయడం సమ్మతంకాదని, అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నానని ట్విటర్లో పేర్కొన్నారు.