అమరావతి : నిత్యం ట్విటర్లో చురుకుగా ఉండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలతో పాటు దేశ, ప్రపంచ రాజకీయాలపై ట్వీట్ చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి (MP Vijayasai Reddy ) తాజాగా మరో ట్వీట్ (MP Vijayasai Reddy Tweet ) చేసి ఆసక్తి రేపాడు. ఏపీలో ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandra Babu) పాలనను పరోక్షంగా విమర్శిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ (Pawan Kalyan) పై పొగడ్తల వర్షం కురిపించాడు.
ఆంధ్రప్రదేశ్‌ను ‘యంగ్ స్టేట్’ గా పోలుస్తూ రాష్ట్రాన్ని 75 ఏళ్ల వయస్సుగల చంద్రబాబు నాయకత్వం ఇక అనవరసరమంటూ వ్యాఖ్యనించారు. పవన్‌కల్యాణ్‌కు జాతీయ స్థాయిలో ఉన్న పాపులారిటీ ,అతని వయసు దృష్య్యా ఏపీకి నాయకత్వం వహించే సామర్ద్యం ఉందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు.