Margani Bharat | ప్రభుత్వ ఖజానాకు టీడీపీ ఎమ్మెల్యేలు, వాళ్ల బినామీలు గండి కొడుతున్నారని వైసీపీ అధికార ప్రతినిధి మార్గాని భరత్ విమర్శించారు. తెలంగాణలో ఒక్కో మద్యం షాపునకు 48 టెండర్లు వస్తే.. ఏపీలో మాత్రం ఒక్క షాపునకు మూడు టెండర్లు మాత్రమే రావడం విచిత్రంగా ఉందన్నారు. కనీసం లక్ష టెండర్లు పడాల్సి ఉండగా.. కనీసం పదో వంతు టెండర్లు కూడా పడకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. దీని ద్వారా ప్రభుత్వానికి రావాల్సిన 2000 కోట్లకు గండిపడిందని విమర్శించారు.
వరద బాధితుల కోసం విరాళాల రూపంలో వచ్చిన డబ్బు ఏమైందని టీడీపీ నేతలను మార్గాని భరత్ ప్రశ్నించారు. వరద బాధితుల కోసం మీరు ఖర్చు చేసింది ఎంత అని నిలదీశారు. పులిహోర పంపిణీ కోసం రూ.23 కోట్లు ఖర్చు చేయడం.. అగ్గిపెట్టెలు, కొవ్వొత్తుల కోసం రూ.23 ఖర్చు పెట్టినట్లు చూపించడం దారుణమని మండిపడ్డారు. సీఎంఆర్ఎఫ్ కింద వచ్చిన రూ.500 కోట్లు ఏం చేశారని ప్రశ్నించారు. వరద బాధితుల కోసం కేంద్రం నుంచి వచ్చిన నిధులు ఏమయ్యాయని నిలదీశారు.
సీఎం @ncbn ఢిల్లీ వెళ్లింది దేనికి?
ఏం మాట్లాడటానికి వెళ్లారు?
విజన్ 2047 అని అబద్ధాలు చెప్పడానికా?
భారత దేశ ఎకానమీ 3.1 ట్రిలియన్ డాలర్స్ అయితే….
ఏపీలో 2.3 ట్రిలియన్ డాలర్ ఎకానమీ చేస్తానని ప్రధానితో సీఎం చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదం.
చంద్రబాబు ప్రజల చెవుల్లో పువ్వులు… pic.twitter.com/RlYV3hnwA4— YSR Congress Party (@YSRCParty) October 8, 2024
చంద్రయాన్ కోసం ఇస్తో ఖర్చు చేసింది రూ.618 కోట్లు అయతే.. చంద్రబాబు వరదల్లో చూపిన ఖర్చు రూ.500 కోట్లు అని సోషల్మీడియాలో ట్రోల్ అవుతుందని మార్గాని భరత్ అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో నిల్వదీసిన 87 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక ఏమైందని ప్రశ్నించారు.