Duvvada Srinivas | ఏపీలో వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ విబేధాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. దువ్వాడ శ్రీనివాస్, వాణి ఇద్దరూ పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. తనను అనవసరంగా మధ్యలోకి లాగుతున్నారని దివ్వల మాధురి కూడా తీవ్రంగా స్పందించారు. ఇందులో ఎవరి వాదన సరైనదో అర్థం కాని పరిస్థితుల్లో ఉండగా దువ్వాడ శ్రీనివాస్ తల్లి లీలావతి కూడా స్పందించారు.
తన కొడుకు దువ్వాడ శ్రీనివాస్‌ను వాణి 30 ఏళ్లుగా వేధిస్తోందని లీలావతి ఆరోపించారు. వాణికి మందు పిచ్చి, డబ్బు పిచ్చి, రాజకీయ పిచ్చి ఉందంటూ సంచలన ఆరోపణలు చేశారు. రాజకీయ కాంక్షతో తన కొడుకును హింసిస్తోందని, ఆస్తుల కోసం ఇబ్బంది పెడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. తన కొడుకు పడుతున్న బాధలు చూసి విడాకులు ఇవ్వమని ఎప్పట్నుంచో చెబుతున్నానని తెలిపారు. ప్రేమ వివాహం కాబట్టి వాణితోనే శ్రీను కొనసాగాడని చెప్పారు. కానీ తన మనమరాళ్లు కూడా శ్రీనును తిట్టడం చూస్తుంటే బాధ కలుగుతోందని వాపోయారు. దువ్వాడ శ్రీను ఉంటున్న ఇల్లు తన చిన్న కొడుకు శ్రీధర్ కట్టించాడని తెలిపారు. ఆ ఇంటితో శ్రీనుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. తమ ఆస్తిలో చిల్లిగవ్వ కూడా వాణికి చెందదని అన్నారు.
తన భార్య వాణికి రాజకీయ కాంక్ష ఎక్కువ అని దువ్వాడ శ్రీను తెలిపారు. దీనివల్లే తమ మధ్య అంతర్గత విబేధాలు తలెత్తాయని చెప్పారు. గత రెండేళ్లుగా ఈ విబేధాలు తీవ్రమయ్యాయని.. ప్రతి రోజు ఏదో ఓ గొడవ జరిగేదని పేర్కొన్నారు. తనకు ఎమ్మెల్యే సీటు కావాలని టార్చర్ చేసేదని బయటపెట్టారు. ఆమె టార్చర్ పడలేక గతంలో తన కారులో మూడు రోజులు పడుకున్నానని బయటపెట్టారు. తండ్రిగా తన కూతుళ్లకు అంతా మంచే చేశానని స్పష్టం చేశారు. మాధురి అనే మహిళ తనను ట్రాప్ చేయడానికి తానేం చిన్న పిల్లాడిని కాదని అన్నారు. మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదని.. మాధురినే ఎన్నికలప్పుడు తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. ఇప్పుడు నా దగ్గర నయాపైసా లేదు. కాబట్టి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా రాంగ్ అని కొట్టిపారేశారు.
మాధురికి నేను ఆస్తులు ఇవ్వాల్సిన పని లేదని.. మాధురినే ఎన్నికలప్పుడు తన కోసం రెండు కోట్లు ఖర్చు చేసిందని స్పష్టం చేశారు. ఇప్పుడు నా దగ్గర నయాపైసా లేదు. కాబట్టి నన్ను ఎందుకు బ్లాక్ మెయిల్ చేస్తుందని ప్రశ్నించారు. ఇదంతా రాంగ్ అని కొట్టిపారేశారు.
దువ్వాడ శ్రీనివాస్‌ను తాను ట్రాప్ చేయలేదని దివ్వెల మాధురి స్పష్టం చేశారు. తననే దువ్వాడ శ్రీనివాస్ సతీమణి వాణి రాజకీయంగా తనను ట్రాప్ చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే టికెట్ పొందడం కోసం తనను పావుగా వాడుకుందని తెలిపారు. వాణినే తనను రాజకీయాల్లోకి తీసుకొచ్చారని.. ఇప్పుడు తానెవరో తెలియదని అంటుందని విమర్శించారు. దువ్వాడ శ్రీనివాస్‌కు, వాణికి మధ్య ఏవైనా విబేధాలు ఉంటే వారే మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని సూచించారు. వాణి మాటలు పట్టుకుని అనవసరంగా తనను ఇందులోకి లాగొద్దని విజ్ఞప్తి చేశారు.
శ్రీనివాస్‌ను వాణి ఇంట్లోకి రానివ్వకపోతే తన ఇంట్లో ఉంచుకోవాల్సి వచ్చిందని చెప్పారు. శ్రీనివాస్ బ్యాంక్ బ్యాలెన్స్ జీరో అని.. అతని వద్ద ఆస్తులేమీ లేవని ఆమె స్పష్టం చేశారు. ఉన్నవన్నీ కుటుంబానికే దారాధత్తం చేశారని స్పష్టం చేశారు. తమ కుటుంబం ఆర్థికంగా మంచి స్థానంలో ఉందని ఆమె తెలిపారు. శ్రీనివాస్‌ను ట్రాప్ చేయాల్సిన అవసరం తనకేంటి? అని ప్రశ్నించారు. శ్రీనివాస్‌ను డబ్బు కోసం ట్రాప్ చేయాల్సిన అవసరం తనకు లేదని తెలిపారు. ఎన్నికల కోసం శ్రీనుకు తన సొంత డబ్బు రెండు కోట్లు ఖర్చు చేశానని బయటపెట్టారు.