Mangalagiri | మంగళగిరి అభ్యర్థిని మార్చేసిన వైసీపీ.. కీలక వ్యాఖ్యలు చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఆర్కే
Mangalagiri | మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముందుగా గంజి శ్రీనివాస్‌కు మంగళగిరి టికెట్ కేటాయించింది.
Mangalagiri | మంగళగిరి నియోజకవర్గం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. గత ఎన్నికల్లో మాదిరిగానే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ను ఇక్కడ చిత్తుగా ఓడించాలని వైసీపీ లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ క్రమంలోనే అక్కడి రాజకీయ పరిస్థితుల దృష్ట్యా ముందుగా గంజి శ్రీనివాస్‌కు మంగళగిరి టికెట్ కేటాయించింది. కానీ అనూహ్యంగా నిన్న వైసీపీ విడుదల చేసిన 9వ జాబితాలో మంగళగిరి సీటును గంజి శ్రీనివాస్‌ను తొలగించి.. మురుగుడు లావణ్యకు కేటాయించి షాకిచ్చారు. ఈ మార్పుపై మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ( ఆర్కే ) స్పందించారు.
మంగళగిరిలో మళ్లీ వైసీపీ జెండా ఎగురవేస్తామని ఆర్కే స్పష్టం చేశారు. రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం నుంచి వచ్చిన లావణ్య గెలుపు ఖాయమని అన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మంగళగిరిలో నాన్ లోకల్, బీసీ అభ్యర్థుల మధ్య పోటీ ఉంటుందని వ్యాఖ్యానించారు. టీడీపీ నుంచి పోటీ చేస్తున్న నారా లోకేశ్‌ను ఉద్దేశించి ఆయన నాన్ లోకల్ అని పేర్కొన్నారు. మంగళగిరి సీటు గెలిపించి జగన్‌కు కానుకగా ఇస్తానని అన్నారు. టీడీపీకి మరోసారి భంగపాటు తప్పదని పునరుద్ఘాటించారు. గత ఎన్నికల్లో మంగళగిరిలో లోకేశ్‌ను ఓడించి వైసీపీ తరఫున ఆర్కే గెలిచారు. కానీ వైసీపీలో పలువురు నేతల తీరుతో విసిగిపోయిన ఆర్కే.. వైఎస్ షర్మిల వెంట కాంగ్రెస్‌లోకి వెళ్లారు. అక్కడ విధానాలు నచ్చకపోవడంతో తిరిగి వైసీపీ గూటికే చేరారు.
ఇక మురుగుడు లావణ్య విషయానికొస్తే ఆమెది రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం. లావణ్య తల్లి కాండ్రు కమల 2009 నుంచి 2014 వరకు మంగళగిరి ఎమ్మెల్యేగా పనిచేశారు. అంతకుముందు 2004లో మంగళగిరి మున్సిపల్ చైర్‌పర్సన్‌గానూ ఎన్నికయ్యారు. లావణ్య మామ మురుగుడు హనుమంతరావు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎథిక్స్ కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరిస్తున్నారు. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి కేబినెట్లోనూ పనిచేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
JD Vance | ‘ఇండియా విషయంలో హద్దులు దాటా.. ఆ పదం వాడటం కరెక్ట్ కాదు’ : జేడీ వాన్స్
Surya Prabha Vahanam | సూర్యప్రభ వాహనంపై శ్రీ మలయప్పస్వామి దివ్యదర్శనం
Greater Noida | డ్రగ్స్ తయారీ ల్యాబ్ గుట్టురట్టు.. రూ.45 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఇద్దరు నిందితులు అరెస్టు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

