అమరావతి : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ పీఏసీ చైర్మన్‌గా (PAC Chairman) మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (Peddireddy Nomination) గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన తరుఫున వైసీపీ ఎమ్మెల్యేలు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, తాటిపర్తి చంద్రశేఖర్ బలపరిచారు. పీఏసీ కమిటీలో మొత్తం 12 మంది సభ్యులకు గాను 9 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎమ్మెల్సీలు ఉంటారు. అయితే అన్ని స్థానాలకు కూటమి నుంచి 12 మంది నామినేషన్లు వేయడం గమన్హారం.
అంతకు ముందు నామినేషన్‌కు వేయడానికి వచ్చిన వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను అసెంబ్లీ అధికారులు రెండు గంటలపాటు ఎదురుచూసేలా చేశారని బొత్స సత్యనారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ దాఖలు గడువు మధ్యాహ్నం 1 గంటతోనే ముగియాల్సి ఉండగా వైసీపీ నాయకులు ఉదయం 11 గంటలకే అసెంబ్లీ కార్యదర్శి ఛాంబర్ వద్దకు చేరుకున్నారు.
అప్పటికే అక్కడ అధికారులు లేకపోవడంతో రెండు గంటల పాటు అధికారుల రాకకు ఎదురుచూసి మండలిలో వైసీపీ నాయకుడు బొత్సకు ఫిర్యాదు చేశారు. అధికారులపై బొత్స మండిపడడంతో అధికారులు ఛాంబర్‌కు చేరుకుని నామినేషన్‌ను స్వీకరించారు.