Pulivendula Elections | పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికలు జరుగుతున్న తీరుపై మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. చరిత్రలో ఎన్నడూ జరగనంత ఘోరంగా ఈ ఎన్నికలు జరుగుతున్నాయని అన్నారు. జమ్మలమడుగు, కమలాపురం ప్రాంతాల నుంచి వచ్చిన టీడీపీ కార్యకర్తలు ఇక్కడ క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేస్తున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యాలయంలో అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడుతూ.. దొంగ ఓట్లు వేసేవారిని అడ్డుకోకుండా.. పోలీసులే స్వయంగా వారిని తీసుకెళ్లి దొంగ ఓట్లు వేయిస్తున్నారని విమర్శించారు. దొంగ ఓట్లు వేసే వాళ్ల పేర్లతో సహా వైసీపీ నేతలు వివరాలను తెలిపారని అన్నారు.
వైసీపీ నాయకులు, కార్యకర్తలను పోలింగ్ బూత్‌ల దగ్గరకు కూడా రానివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. తమ పార్టీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకుని ఇష్టానుసారంగా తిప్పారని అన్నారు. ఖాకీ దుస్తులు వేసుకున్న సంగతి కూడా మరిచిపోయి టీడీపీ ఏజెంట్లా ఎన్నికలు జరిపే కార్యక్రమాన్ని డీఐజీ కోయ ప్రవీణ్ చేపట్టారని మండిపడ్డారు. ఆయన ఇంత దారుణంగా ప్రవర్తిస్తే సమాజం చూస్తూ ఊరుకుంటుందా అని ప్రశ్నించారు. పులివెందుల వైసీపీ కార్యాలయంలో ఎంపీ అవినాశ్ రెడ్డి కూర్చుంటే స్వయంగా డీఐజీ వెళ్లారని.. మరో డీఎస్పీ నానా దుర్భాషలు ఆడారని, ఆఫీసు బయట ఉన్న జనాన్ని చెదరగొట్టే ప్రయత్నం చేశారని మండిపడ్డారు. మీరు ఖాకీలు వదిలి.. పచ్చ చొక్కాలు వేసుకుని తిరిగితే బాగుంటుందని ఎద్దేవా చేశారు.
పోలీసుల సమక్షంలోనే రిగ్గింగ్
ఒంటిమిట్ట జడ్పీ హైస్కూల్ టీడీపీ నేతలను లోపలికి పంపించి రూంలకు కాపలా కాస్తున్న పోలీసులు..
వైయస్ఆర్సీపీ నేతలను గేటు వద్ద అడ్డుకున్న పోలీసులు . pic.twitter.com/n0Gxsp07SE
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
సాయంత్రం 5 గంటల వరకు విచ్చలవిడిగా పోలింగ్ కేంద్రాల్లో అక్రమాలు చేసుకునేందుకు అవినాశ్ రెడ్డిని అడ్డుకుంటున్నారని అంబటి రాంబాబు మండిపడ్డారు. చంద్రబాబు దగ్గర శభాష్ అనిపించుకునే ప్రయత్నాలు డీఐజీ కోయ ప్రవీణ్ చేస్తున్నారని ఆరోపించారు. దీనికి తప్పనిసరిగా మూల్యం చెల్లించకతప్పదని ఆయన హెచ్చరించారు. ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతుంటే మా ఓటు మాకు ఇప్పించాలని జనం పోలీసుల కాళ్లు ఎందుకు పట్టుకుంటారని ప్రశ్నించారు. మహిళలు తమ ఓటు కోసం ఎందుకు ధర్నా చేస్తారని నిలదీశారు.
కాల్చి పడేస్తా నా కొడకా!
పులివెందుల వైఎస్సార్ సిపి కార్యాలయం వద్ద దౌర్జన్యానికి పాల్పడిన డిఎస్పీ pic.twitter.com/jBwiIOR6Ls
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025
నేను రాజకీయాల్లోకి వచ్చాక ఇలాంటి రాజకీయాలు చూడలేదని అంబటి రాంబాబు విమర్శించారు. మీరు తీసుకొచ్చిన ఈ సంస్కృతి.. రేపు మిమ్మల్ని, మీ కొడుకును వెంటాడదా అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని నిలదీశారు. చంద్రబాబు చరిత్రహీనుడిగా మిగిలిపోతారని ఆయన వ్యాఖ్యానించారు. మీకు ఓటేసిన వాళ్లకు చంద్రబాబు ఏంటి.. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారనే భావన కలగదా అని ప్రశ్నించారు.
ఇది ప్రజా స్వామ్యమా? రౌడీ రాజ్యమా?
సాక్ష్యాత్తు మంత్రి రాం ప్రసాద్ రెడ్డి సమక్షంలోనే ఒంటిమిట్ట చిన్న కొత్తపల్లె పోలింగ్ బూత్‌లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏజెంట్‌పై దాడి.
కాళ్లతో తన్నుతూ, పిడిగుద్దులు గుద్దుతూ, చేతికి అందిన వాటితో కొట్టిన @JaiTDP గూండాలు. pic.twitter.com/81QFMh1Svr
— YSR Congress Party (@YSRCParty) August 12, 2025