అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఖాళీగా ఉన్న మూడు రాజ్యసభ స్థానాలకు అభ్యర్థుల (YCP Candidates) పేర్లను వైసీపీ ఖరారు చేసింది. విజయవాడ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. వైసీపీ నాయకులు, టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి (YV Subbareddy) , గొల్ల బాబురావు( Golla Babu rao) , మేడా రఘునాథ్‌రెడ్డి( Meda Raghunath reddy) రాజ్యసభ సభ్యులుగా పోటీ చేస్తారని వెల్లడించారు.
ఏపీలో మొత్తం 175 స్థానాలకు గాను 151 మంది వైసీపీ శాసనసభ్యులు గెలుపొందారు. మరో 23 చోట్ల టీడీపీ గెలుపొందగా ఒక చోట జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రం నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్న సీఎం రమేశ్, కనకమేడల రవీంద్రకుమార్, వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి పదవీ కాలం ఏప్రిల్‌లో ముగియనుంది.
దేశవ్యాప్తంగా ఖాళీ అయిన స్థానాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు పూర్తి చేసింది. త్వరలో ఎన్నికల నోటిఫికేషన్(Election Notification) విడుదల కానున్న తరుణంలో వైసీపీ అభ్యర్థులు ఖరారు చేసి ఎన్నికలకు సిద్ధం అయ్యింది. కాగా ప్రస్తుతం గొల్ల బాబూరావు అనకాపల్లి జిల్లా పాయకరావుపేట అసెంబ్లీ నియోకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు.