అమరావతి : ఏపీలోని అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో( Parawada Pharmacity ) వరుస ప్రమాదాలు కొనసాగుతున్నాయి. తాజాగా డెక్కన్ రెమెడీస్ పరిశ్రమలో రియాక్టర్ వద్ద గ్యాస్ లీకై ( Gas leak ) ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కార్మికుడు నాయుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి గాజువాక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పరవాడ పోలీసులు వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు వెల్లడించారు.