అమరావతి : వైసీపీ పాలనలో వైద్యార్యోగశాఖను నీరుగార్చరని, నాడునేడు పేరిట భవనాలకు రంగులు వేసి అభివృద్ధి అని గొప్పలు చెప్పుకున్నారని వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ (Minister Sathya Kumar) ఆరోపించారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఆరోగ్యశ్రీ(Aarogyasri) లో అనేక అవినీతి, అక్రమాలు జరిగాయని, ఎన్ప్యానెల్ లిస్ట్‌లో లేని ఆసుపత్రులను చేర్చారని అన్నారు. ఇటువంటి వాటిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.
కేంద్రం, రాష్ట్రం నుంచి శాఖకు విడుదలైన నిధులను దారి జగన్ ప్రభుత్వ దారి మళ్లిందని ఆరోపించారు. వైద్యారోగ్య శాఖ (Medical department) ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, గ్రామీణ స్థాయి నుంచి పై స్థాయి వరకు మౌలిక వసతులను కల్పిస్తామని స్పష్టం చేశారు.
ఏపీలో క్యాన్సర్ వల్ల ప్రతి యేట 40 వేలకు పైగా మంది చనిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. క్యాన్సర్ రాకుండా అవగాహనతో పాటు తక్షణమే వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. క్యాన్సర్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని అన్నారు. గంజాయి, డ్రగ్స్ వినియోగం ఎక్కువగా ఉందని వీటిపై ఉక్కుపాదం మోపుతుందని తెలిపారు.