Pawan Kalyan | నవశకం ప్రారంభించాం.. సాధ్యంకాని పొత్తులు సుసాధ్యం చేశాం : పవన్ కల్యాణ్
Pawan Kalyan | ఏపీలో రాజకీయంగా నవశకాన్ని ప్రారంభించామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్( Pawan Kalyan) అన్నారు.
అమరావతి : ఏపీలో రాజకీయంగా నవశకాన్ని ప్రారంభించామని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్( Pawan Kalyan) అన్నారు. భీమవరం మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జనసేన (Janasena) పార్టీలో చేరిన సందర్భంగా ఆయన మంగళగిరిలో మాట్లాడారు. సాధ్యంకాని పొత్తులు సుసాధ్యం చేశామని పేర్కొన్నారు. భీమవరంలో రామాంజనేయులు రాక తమ పార్టీకి ఎంతో కీలకమని అన్నారు.
గతంలో తాను పోటీ చేసిన భీమవరం నుంచి గెలిచి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేదని అన్నారు. అన్యాయం జరిగితే యుద్ధం చేయడం నాకు తెలుసు.. తప్పులు చేసే వ్యక్తిని ప్రశ్నించకుంటే సమాజాన్ని ఎవరూ మార్చలేరని వెల్లడించారు. ఒక వ్యక్తి చేసిన తప్పు అతని కులం, వర్గంపై పడుతుందని అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళిత డ్రైవరును హతమార్చి జైలుకు వెళ్లి రాగా అతడికి జేజేలు పలకడం ఏం సంకేతాలు ఇస్తోందని ఆరోపించారు.
రౌడీయిజం(Rowdyism) పోయేదాక భీమవరాన్ని వదలనని పేర్కొన్నారు. భీమవరానికి రౌడీలు కాదని. బాధ్యత గల వ్యక్తులు ఎమ్మెల్యేగా రావాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలో జగన్ పోవాలి. భీమవరంలో గ్రంథి శ్రీనివాస్ పోవాలని అన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

