అమరావతి : ఏపీలో సంచలనం కలిగిస్తున్న వైసీపీ సోషల్ మీడియా పోస్టింగ్‌లపై వర్రా రవీందర్‌రెడ్డి (Varra Ravinder Reddy) పార్టీ నాయకులపై సంచలన ఆరోపణలు చేశారు. సజ్జల భార్గవరెడ్డి బాధ్యత తీసుకున్నాక మరింత రెచ్చిపోయామని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.
అసభ్యకర పోస్టింగులు పెట్టినందుకు గాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వర్రా రవీందర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలను పేర్కొనడం సంచలనంగా మారుతుంది . పార్టీకి చెందిన నాయకుల ఆదేశాల మేరకే కంటెంట్ ఇస్తే ఫేస్బుక్లో జగనే కావాలి, జగనన్న రావాలి యాప్‌లో అసభ్యకరమైన పోస్టులు చేసేవాళ్లమని వెల్లడించారు.
వైసీపీకి వ్యతిరేకంగా మాట్లాడేవారిని లక్ష్యంగా చేసుకుని నాయకులు, వారి కుటుంబసభ్యులపై వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్ వివేక్‌రెడ్డి సూచనలతో పోస్టులు పెట్టేవాళ్లమన్నారు. జడ్జిలకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాలని భార్గవరెడ్డి బెదిరించారని తెలిపారు. 2023 నుంచి నా ఫేస్బుక్ ఐడీతో భార్గవరెడ్డి పోస్టులు పెట్టేవారని పేర్కొన్నారు.
ఎలాంటి పోస్టులు పెట్టాలనేది అవినాష్‌రెడ్డి, రాఘవరెడ్డి చర్చించేవారని వివరించారు. షర్మిల, సునీత, విజయమ్మపై అసభ్యకర పోస్టులు పెట్టాలని అవినాష్ పీఏ రాఘవరెడ్డి మాకు కంటెంట్ ఇచ్చారని వెల్లడించారు. పవన్ ఆయన పిల్లలపై అసభ్యకరమైన పోస్టులు పెట్టానని వివరించారు. వైసీపీ సోషల్ మీడియాలో భార్గవరెడ్డి, అర్జున్‌రెడ్డి, సుమారెడ్డి కీలకమని స్పష్టం చేశారు.