అమరావతి : వైజాగ్ స్టీల్ ప్లాంట్( Vizag steel plant )ప్రైవేటీకరణపై కేంద్రం చేసిన తాజా ప్రకటనతో కార్మికులు, ఉద్యోగులు బగ్గుమన్నారు. కేంద్రం అవలంభిస్తున్న ధ్వంద వైఖరికి నిరసనగా శుక్రవారం విశాఖ కూర్మన్నపాలెం జాతీయ రహదారి(National High way)పై కేంద్రం దిష్టిబొమ్మ( Effigy )ను కార్మికులు దహనం చేశారు. ఈ సందర్భంగా కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గురువారం విశాఖ ప్లాంట్‌ను సందర్శించిన కేంద్రమంత్రి స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేయడం లేదని ప్రకటించిన తరువాత మరుసటి రోజు భిన్నంగా ప్రైవేటీకరణను ఉపసంహరించుకోలేదని చేసిన ప్రకటనపై కార్మికులు, ఉద్యోగులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్రం విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవైటీకరణను ఉపసంహరించుకోవాలని(Withdraw) డిమాండ్ చేశారు. కేంద్రం ఎన్నికుట్రలు పన్నినా స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకుంటామని ధీమాను వ్యక్తం చేశారు.