Srisailam | ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం వాసులు కే అవినాష్, సాహిత్య శ్రీ మంగళవారం శ్రీశైల దేవస్థానానికి వెండి వస్తువులను విరాళంగా అందజేశారు. 200 గ్రాముల బరువు గల వెండి చెంబు, 200 గ్రాముల బరువు గల వెండి శఠారి, 595 గ్రాముల బరువు గల వెండి నాగ హారతిని సమర్పించారు. భ్రమరాంబికా దేవి అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో వేద పండితులు గంటి రాధాకృష్ణ అవధాని, అమ్మవారి ఆలయ ఉప ప్రధాన అర్చకులు విజయ్ కుమార్, అమ్మవారి ఆలయం ఇన్ స్పెక్టర్ మల్లికార్జున, గుమస్తా సావిత్రికి దాతలు ఈ వస్తువులను అందజేశారు. వీరికి ఆలయం అధికారులు తగు రశీదు ఇచ్చారు. వేద పండితులు వేదాశీర్వచనం చేసి దాతలకు స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
iQoo Z9s 5G | బడ్జెట్ ధరకే ఐక్యూ జడ్9ఎస్ సిరీస్ ఫోన్లు.. 21న ఆవిష్కరణ..!
Tata Curvv EV | 7న టాటా కర్వ్.ఈవీతోపాటు చార్జ్ పాయింట్ అగ్రిగేటర్ ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్..!