అమరావతి : పల్నాడు జిల్లా రాజుపాలెంలో ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబుకు ప్రజల నుంచి నిరసన ఎదురైంది. గడప గడపకు ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఇవాళ మంత్రి గ్రామంలో పర్యటిస్తున్నారు. దీంట్లో భాగంగా రాజుపాలెంలో తనకు పింఛన్ రావడం లేదని దివ్యాంగురాలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు విద్యుత్ మీటర్లు ఉండడంతో పింఛన్ ఇవ్వలేదని అధికారులు మంత్రికి వివరించే ప్రయత్నం చేశారు.
బుల్లబ్బాయి అనే వ్యక్తి మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం ఏమీ చేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యలపై స్థానికులు నిలదీయడంతో మంత్రి అక్కడి నుంచి వెనుతిరిగారు. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతను చిత్రీకరించిన మీడియా వద్ద నుంచి సెల్ఫోన్లను మంత్రి అంబటి పీఏ లాక్కొని వాటిని తొలగించారు.