ప్రొబేషనరీ కోసం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఆందోళన
Village Secretaries: ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను గత కొంత కాలంగా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్‌పై...

(Village Secretaries) శ్రీకాకుళం: ప్రొబేషన్ డిక్లరేషన్ ఆలస్యంపై గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ ఆందోళనను గత కొంత కాలంగా కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్‌పై ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించి పరిష్కరించాలంటూ ఇవాళ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ ర్యాలీలో మండలంలోని అన్ని గ్రామాల్లోని సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. బాధ్యతలు చేపట్టి రెండేండ్ల సమయం పూర్తైనా తమను పట్టించుకుని రెగ్యులర్ చేయలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరు ఉద్యోగుల మాదిరిగానే తమకు కూడా పీఆర్సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు.
ఇలాఉండగా, గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న కార్యదర్శులకు ప్రొబేషనరీ కాలాన్ని మరింత పొడగించడం సబబు కాదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. 2020 అక్టోబర్ నాటికే వారి ప్రొబేషన్ పూర్తయితే.. జూన్ 30 నాటికి పర్మినెంట్ చేస్తామని చెప్పడమేంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నాయకులను మచ్చిక చేసుకుని పీఆర్సీపై ఉద్యోగులకు అన్యాయం చేశారని ఆరోపించారు. రాష్ట్రంలోని నిరుద్యోగులు కూడా తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఈ అంశంపై సోమవారంలోగా సీఎం జగన్ స్పష్టమైన ప్రకటన చేయాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి తామూ ఆందోళనల్లో పాల్గొంటామని హెచ్చరించారు.
కాగా, వైసీపీ నేతలు గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని కదిరి టీడీపీ నేత కందికుంట వెంకట ప్రసాద్ ఆరోపించారు. వైసీపీ నేతలు తమ తీరును మార్చుకోవాలని, లేదంటే తగిన బుద్ధిచెప్తామని హెచ్చరించారు. వైసీపీ నేతల ఆగడాల కారణంగా పలువురు మహిళా ఉద్యోగులు ఇప్పటికే సెలవు పెట్టి వెళ్లిపోయారని చెప్పారు.
ఇవి కూడా చదవండి..
ఇలా చేస్తే కరోనా నుంచి కోలుకుంటారు..!
క్రష్ క్రీం.. ఇది ఓ వెరైటీ ఐస్‌క్రీం.. ఏంటి దీని స్పెషాలిటీ..?
ఇలా చేస్తే ఇమ్యూనిటీ ఫుల్..ఒమిక్రాన్ నుంచి సేఫ్!!
గోర్లు, పెదవులు, చర్మం రంగు మారిందా.. ఒమిక్రాన్ కావచ్చు..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aadarsha Kutumbam | ఆదర్శ కుటుంబంలో అదిరిపోయే సర్ప్రైజ్.. వెంకటేష్ అభిమానులకు త్రివిక్రమ్ ట్రీట్!
Road Accident | మద్యం మత్తులో కారు నడిపి స్కూటీని ఢీకొట్టిన యువకుడు.. ముగ్గురు దుర్మరణం..!
Mythri Movie Makers | మైత్రీ మూవీ మేకర్స్ నుంచి మరో రొమాంటిక్ కామెడీ.. డెబ్యూ ఇస్తున్న శ్రీకాంత్ కుమార్తె
IAS Transfers | ఏపీలో పలువురు ఐఏఎస్‌ల బదిలీ.. పర్యాటక శాఖ కార్యదర్శిగా ఆమ్రపాలికి పోస్టింగ్!
Chiranjeevi | చిరంజీవి ‘కాకా’ సినిమాలో బాలయ్య కుమార్తె తేజస్విని.. బాబీ సంప్రదించడంపై భరత్ ఏమన్నారంటే!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

