Vangaveeti Radha | విజయవాడ టీడీపీ నేత వంగవీటి రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన కేసులో నగర పోలీసులు కార్పొరేటర్ అరవ సత్యంను విచారించారు. అయితే, పోలీసుల విచారణలో స్పృహ కోల్పోయిన అరవ సత్యం ప్రస్తుతం ఆంధ్రా దవాఖానలో చికిత్స పొందుతున్నాడు. రాధా ఇంటి వద్ద రెక్కీ నిర్వహించిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. కొందరు బెజవాడకు చెందిన వ్యక్తులపైనే పోలీసులకు అనుమానాలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే, తన వ్యక్తిగత భద్రతకు ప్రభుత్వం కేటాయించిన గన్‌మెన్‌ను వంగవీటి రాధా వెనక్కు పంపేశారు. గన్మెన్లు వద్దని చెప్పిన మాట నిజమేనని రాధా చెప్పారు. తాను నిత్యం ప్రజల్లో తిరిగే వ్యక్తినని, అందుకే గన్మెన్ల భద్రత వద్దని చెప్పానన్నారు. తనకు అన్ని పార్టీల నేతలతో పరిచయాలు ఉన్నాయని అన్నారు. పార్టీల కతీతకంగా అన్ని పార్టీల నేతలు తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నారని రాధా చెప్పారు.