Vijayawada | మహిషాసురమర్థినీ అలంకారంలో దర్శనమిచ్చిన బెజవాడ దుర్గమ్మ
Vijayawada | ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది.
Vijayawada | ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు కనులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఎనిమిదో రోజైన ఆశ్వీయుజ శుద్ధ నవమి రోజున దుర్గమ్మ మహిషాసురమర్థినీ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చింది. అష్టభుజాలతో దుష్టుడైన మహిషాసురుడిని సంహరించింది ఈ రూపంలోనే. నవదుర్గల్లో అత్యుగ్రరూపమని పండితులు చెప్పారు. జగన్మాత లేతరంగు దుస్తుల్లో సింహ వాహనాన్ని అధిష్టించి, ఆయుధాలను ధరించి మహాశక్తిగా భక్తులను అనుగ్రహిస్తుంది. దేవీ నవరాత్రుల్లో ఆశ్వయుజ శుద్ధనవమి తిథిని మహర్నవమిగా పిలుస్తుంటారు. ఎనిమిది రోజుల యుద్ధం అనంతరం దుర్గమ్మ నవమి రోజున మహిషాసురుడిని సంహకరించి.. లోకాలకు ఆనందాన్ని చేకూర్చింది.
అమ్మవారి అవతారాలన్నింటిలోనూ దుష్టశిక్షణ చేసినా మహిషాసురమిర్థిని అత్యంత ఉగ్రంగా ఉంటుంది. దేవతలు చేసిన చిద్యాగకుండం నుంచి వెలుగుముద్దగా ఆవిర్భవించి.. సకల దేవతల అంశలను గ్రహించి, వారిచ్చిన ఆయుధాలతో దున్నపోతు మనస్తత్వం మూర్తీభవించిన మహిషాసుడిని సంహరించింది. సింహవాహనంపై, ఉగ్రరూపంతో, అష్టభుజాలతో పాశం, అంకుశం, త్రిశూలం తదితర ధరించి దర్శనమిచ్చే మహాశక్తిని పూజిస్తే శత్రుభయం ఉండదు భక్తుల నమ్మకం. మహిషాసురమర్థిని అలంకారంలో దర్శనమిచ్చిన అమ్మవారిని దర్శించుకునేందుకు పెద్దసంఖ్యలో భక్తులు బారులు తీరారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

