Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలు వచ్చే జన్యుపరమైన ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మొత్తం 28 సాధారణ వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన ప్రమాదాన్ని పరిశీలించిన పరిశోధకులు, ప్రతి వ్యక్తిలోనూ కొన్ని వ్యాధులతో సంబంధం ఉన్న జన్యు మార్పులు ఉంటాయని గుర్తించారు.
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా చాలామందికి మధుమేహం, గుండె సంబంధిత వ్యాధులు, స్కిజోఫ్రెనియా వంటి సమస్యలు వచ్చే జన్యుపరమైన ముప్పు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది. మొత్తం 28 సాధారణ వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన ప్రమాదాన్ని పరిశీలించిన పరిశోధకులు, ప్రతి వ్యక్తిలోనూ కొన్ని వ్యాధులతో సంబంధం ఉన్న జన్యు మార్పులు ఉంటాయని గుర్తించారు. అయితే జన్యుపరమైన ముప్పు ఉన్నంత మాత్రాన ఆ వ్యాధులు తప్పనిసరిగా వస్తాయని అర్థం కాదు. వ్యక్తి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితితో సంబంధం లేకుండా, జన్యువుల ఆధారంగా మాత్రమే చూసినప్పుడు కూడా చాలామందిని కొన్ని వ్యాధులకు అధిక ప్రమాదం ఉన్నవారిగా గుర్తించవచ్చని పరిశోధకులు వివరించారు.
10వేల మార్పులతో జన్యువుల క్రమం ప్రభావితం..
ప్రతి వ్యక్తి జన్యు నిర్మాణంలో సుమారు 50 లక్షల జన్యు వైవిధ్యాలు ఉంటాయని అధ్యయనం తెలిపింది. వీటిలో దాదాపు 10 వేల మార్పులు జన్యువుల క్రమాన్ని ప్రభావితం చేస్తాయి. ఈ మార్పుల వల్ల లాక్టోజ్ జీర్ణం కాకపోవడం నుంచి కొన్ని మందులకు శరీరం ఎలా స్పందిస్తుందనే అంశాల వరకు ప్రభావాలు ఉంటాయి. అయితే వీటిలో చాలావరకు శరీరంపై ఎలాంటి ప్రతికూల ప్రభావం చూపించవు. ప్రతి వ్యక్తిలో తీవ్రమైన జన్యుపరమైన వ్యాధులకు కారణమవుతాయని గతంలో గుర్తించిన ఒకటి నుంచి మూడు అరుదైన జన్యు మార్పులు ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. వీటితోపాటు వైద్యపరంగా ఎలాంటి ప్రభావం చూపుతాయో ఇంకా స్పష్టంగా తెలియని మరో 50 అరుదైన జన్యు మార్పులు కూడా ఉంటాయని వెల్లడించారు.
భౄరీ స్థాయిలో సమాచార విశ్లేషణ..
బ్రిటన్‌లోని ఎక్సెటర్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకుల నేతృత్వంలో ఈ అధ్యయనం జరిగింది. బ్రిటన్ బయోబ్యాంక్, అమెరికాలోని ఆల్ ఆఫ్ అస్ అనే రెండు భారీ ఆరోగ్య సమాచార నిధుల్లోని దాదాపు 10 లక్షల మందికి సంబంధించిన పూర్తి జన్యు సమాచారాన్ని విశ్లేషించారు. 28 సాధారణ వ్యాధులకు సంబంధించిన జన్యుపరమైన ప్రమాదాన్ని అంచనా వేసేందుకు పాలీజెనిక్ రిస్క్ స్కోర్లను కూడా పరిశీలించారు. ఈ అంచనాల ప్రకారం సగటు వ్యక్తి దాదాపు మూడు వ్యాధుల విషయంలో అత్యధిక జన్యుపరమైన ప్రమాదం ఉన్నవారిలో మొదటి 10 శాతంలో ఉంటారని అధ్యయనం తెలిపింది. అలాగే ప్రతి ఐదుగురిలో ఒకరికి కనీసం ఒక వ్యాధి విషయంలో అత్యధిక ప్రమాదం ఉన్న మొదటి ఒక శాతం మందిలో చోటు ఉంటుందని పరిశోధకులు అంచనా వేశారు.
మార్పులు కనిపిస్తే ఆందోళన చెందాలా..
అయితే జన్యు పరీక్షల్లో వ్యాధులకు సంబంధించిన మార్పులు కనిపించినంత మాత్రాన ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పరిశోధకులు సూచిస్తున్నారు. పరీక్ష ఫలితాలను అర్థం చేసుకునేటప్పుడు వ్యక్తికి ఉన్న లక్షణాలు, కుటుంబంలో వ్యాధుల చరిత్ర, జీవనశైలి, పర్యావరణ పరిస్థితులు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. జన్యుపరమైన మార్పుల్లో చాలావరకు వ్యక్తికి వ్యాధిని కలిగించవని గుర్తుంచుకోవాలి. ఈ అధ్యయనంలో పెద్ద సంఖ్యలో వ్యక్తుల సమాచారం ఉపయోగించినప్పటికీ, పాల్గొన్నవారిలో పశ్చిమ ఐరోపా మూలాలున్నవారే ఎక్కువగా ఉన్నారు. వివిధ ప్రాంతాలు, జాతులకు చెందిన ప్రజల జన్యు సమాచారాన్ని కూడా సేకరించి పరిశీలిస్తే జన్యుపరమైన ప్రమాదాలపై మరింత స్పష్టమైన అవగాహన వస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS | కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ .. బీఆర్ఎస్లో చేరిన ఉప సర్పంచ్, వార్డు సభ్యులు
Gene Related Risk | ప్రపంచవ్యాప్తంగా ప్రజలకు పెరుగుతున్న జన్యుపరమైన ముప్పు.. అధ్యయనంలో వెల్లడి..
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో రోహిత్ నాయుడు ఎలిమినేషన్.. సీక్రెట్ రూమ్‌కు వెళ్లేందుకు నిరాకరించాడా?
YS Jagan Protest | పులివెందుల ఆర్వో కార్యాలయం వద్ద బైఠాయించిన వైఎస్ జగన్
India vs New Zealand | ఓపెనర్లను కోల్పోయిన టీమిండియా.. స్కోర్ ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

