అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా(Chief Secretary) విజయానంద్ (Vijayanand) నియమితులయ్యారు. ఇప్పటి వరకు ఉన్న నీరబ్‌కుమార్ ప్రసాద్ ( Nirabkumar Prasad) పదవీకాలం నేటితో ముగియడంతో ఆయన స్థానంలో విజయానంద్‌ను నియమించారు. మంగళవారం కొత్త సీఎస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు. వచ్చే ఏడాది నవంబర్‌లో ఆయన పదవీ విరమణ చేయనున్నారు.
1992 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి విజయానంద్ స్వస్థలం వైఎస్సార్ జిల్లా రాజుపాలెం మండలం అయ్యవారిపల్లె. ట్రాన్స్‌కో, జెన్కో ఎండీగా సుదీర్ఘకాలం పనిచేశారు. ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చంద్రబాబు సీఎస్‌గా ఉన్న జవహర్‌రెడ్డిని బదిలీ చేసి నీరబ్కుమార్కు సీఎస్‌గా బాధ్యతలు అప్పగించారు. కేవలం ఆరునెలల పాటు మాత్రమే నీరబ్‌కుమార్ రాష్ట్రానికి సేవలందించారు.