అమరావతి : బాధితుడి నుంచి లంచం తీసుకున్న ప్రభుత్వ అధికారిని ఏసీబీ అధికారులు పట్టుకున్న వైనం విశాఖలో చోటు చేసుకుంది. జిల్లాలోని గొలుగొండ మండలం వెలుగు కార్యాలయంలో ఏపీఎంగా విధులు నిర్వహిస్తున్న గోవిందరావు అనే అధికారి ఒక పని నిమిత్తం లంచం డిమాండ్ చేశాడు. అంత పెద్ద మొత్తంలో తాను ఇవ్వలేనని మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు ఈరోజు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళిక రచించి బాధితుడి నుంచి రూ. 14వేలు లంచం తీసుకుంటుండగా ఏపీఎంను రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. అవినీతి నిరోదక చట్టం ప్రకారం ఏపీఎం పై కేసు నమోదు చేసి అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు.