అమరావతి : అమరావతి : ఏపీ ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారి హఠాన్మరణ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి అన్నారు. మేకపాటి మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ,వారి పవిత్ర ఆత్మకు సద్గతులు ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు ట్విటర్లో పేర్కొన్నారు. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు వెల్లడించారు.
మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాన్మరణం పట్ల ఏపీ ప్రభుత్వం రెండు రోజుల పాటు సంతాపదినాలుగా ప్రకటించింది. గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ఈ నెల 23వ తేదీన నెల్లూరు జిల్లాలోని మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లిలో నిర్వహించనున్నారు. సోమవారం రాత్రికి గౌతమ్ రెడ్డి పార్థివదేహాన్ని నెల్లూరు జిల్లాకు తరలించనున్నారు.