అమరావతి : ఏపీలోని అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలోని దక్షిణ ఎనర్జీ (Dakshin Energy) కెమికల్ ఫ్యాక్టరీలో మంగళవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ఇద్దరు కార్మికులు సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు మంటల్లో చిక్కున్నట్లు సమాచారం. గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
మృతులను అచ్యుతాపురం ప్రాంతానికి చెందిన వేపాడ వెంకటేష్, త్రినాథ్లుగా అధికారులు గుర్తించారు. ప్రమాదంపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను హెచ్చరించారు.