Tirupati | తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భాకరాపేట ఘాట్ రోడ్డులో రెండు ఆర్టీసీ బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 30 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.
ప్రమాదం గురించి తెలియగానే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఒక బస్సు ముందు భాగం నుజ్జునుజ్జుకావడంతో క్యాబిన్లోనే డ్రైవర్ ఇరుక్కుపోయాడు. డ్రైవర్ను బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. కాగా, ప్రమాదం కారణంగా రెండు బస్సులు ఘాట్ రోడ్డుపై అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. దీంతో రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.
మరోవైపు తిరుమల రెండో ఘాట్ రోడ్డులో ఒక ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పిట్టగోడను ఢీకొట్టింది. క్రాష్ బారియర్ పటిష్టంగా ఉండటంతో అదృష్టవశాత్తూ బస్సు లోయలో పడకుండా పెను ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో పలువురు భక్తులు స్వల్పంగా గాయపడ్డారు. కాగా, ఘాట్ రోడ్డుపై బస్సు అడ్డంగా నిలిచిపోవడంతో కిలోమీటర్ మేర వాహనాలు నిలిచిపోయాయి.