కర్నూలు జిల్లా వెలుగోడు రిజర్వాయర్లో పుట్టి మునిగి ఇద్దరు మత్స్యకారులు గల్లంతయ్యారు. రిజర్వాయర్లో చిక్కుకున్న ఈ ఇద్దరి కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే రిజర్వాయర్లో నీటి మట్టం అధికంగా ఉండటంతో ఆచూకీ దొరకడం కష్టతరమవుతోందని, అయినా.. వెతుకుతుంటామని అధికారులు పేర్కొన్నారు.