తిరుమల : టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు (Ttd Members) గా ఆరుగురు తిరుమల శ్రీవారి ఆలయంలో బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర దేవదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ ఎక్స్అఫీషియో సభ్యులుగా,వై.సీతారామిరెడ్డి, బాలసుబ్రమణియన్ పళనిస్వామి, ఆర్.వెంకటసుబ్బారెడ్డి, సిద్దవటం యానాదయ్య, సిద్ధా వీరవెంకట సుధీర్ కుమార్ ధర్మకర్తల మండలి సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీవారి ఆలయ సన్నిధిలో టీటీడీ జేఈవో వీరబ్రహ్మం వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు.
స్వామివారి దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం శ్రీవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని జేఈవో అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈవోలు లోకనాథం, గోవిందరాజన్, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఏపీ ప్రభుత్వం ఇటీవల 24 మంది బోర్డు సభ్యులుగా మరో నలుగురిని ఎక్స్ అఫిసియో సభ్యులుగా నియమించిన విషయం తెలిసిందే.