తిరుమల : ఆడికృతిక పర్వదినం సందర్భంగా తిరుత్తణి శ్రీ సుబ్రహ్మణ్యస్వామికి ( Subrahmanya Swamy) టీటీడీ (TTD) చైర్మన్ బీ.ఆర్.నాయుడు ( BR Naidu ) శనివారం శ్రీవారి సారె సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ మర్యాదలతో తిరుత్తణి ఆలయ చైర్మన్ శ్రీధర్, తమిళనాడు దేవాదయశాఖ జాయింట్ కమిషనర్ రమణి టీటీడీ చైర్మన్కు స్వాగతం పలికారు. అనంతరం మంగళవాయిద్యాల నడుమ చైర్మన్ బీ.ఆర్. నాయుడు టీటీడీ తరఫున పట్టు వస్త్రాలను తిరుత్తణి దివ్య క్షేత్రంలో సుబ్రహ్మణ్యస్వామికి సమర్పించారు. వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామివారి దర్శన అనంతరం ఆలయ అర్చకులు చైర్మన్ ఆశీర్వచనం అందించి, పట్టువస్త్రాలతో సత్కరించి తీర్థప్రసాదాలను అందజేశారు.