TTD | జమ్మూ టీటీడీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో ఆగమోక్తంగా క్షీరాధివాసం
TTD | జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి నది ఒడ్డున టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు.
జమ్మూ : జమ్మూలోని మజీన్ గ్రామంలో తావి నది ఒడ్డున టీటీడీ నిర్మించిన వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగళవారం ఆగమోక్తంగా క్షీరాధివాసం నిర్వహించారు. మహాసంప్రోక్షణ కార్యక్రమాల్లో భాగంగా బింబశుద్ధి కోసం క్షీరాధివాసం చేపట్టారు. శ్రీ వేంకటేశ్వరస్వామి, పద్మావతి , గోదాదేవి, గరుడాళ్వార్, ద్వారపాలకుల విగ్రహాలకు గోవు పాలతో అభిషేకం చేశారు. అనంతరం ఆలయ విమానగోపురం, ధ్వజస్తంభాలను అద్దంలో చూపి పాలతో అభిషేకం చేశారు.

అంతకుముందు యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరు వేణుగోపాలదీక్షితులు, కంకణభట్టార్ రామకృష్ణ దీక్షితులు, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు, డిప్యూటీ ఈవోలు గుణభూషణ్ రెడ్డి, శివప్రసాద్, ఈఈ సుధాకర్, డిప్యూటీ ఈఈలు రఘువర్మ, చెంగల్రాయలు, ఏఈవో కృష్ణారావు, ఏఈ సీతారామరాజు, సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, టెంపుల్ ఇన్స్పెక్టర్ సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

